Best Web Hosting Provider In India 2024
కోడిగుడ్లలో చాలా ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చాలా మందికి తెలుసు. ఒక్కో సాధారణ గుడ్డులో సుమారు 6.29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాలు పెరిగేందుకు ఈ ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, వెజిటేరియన్లు చాలా మంది కోడిగుడ్లు తినరు. అయితే, గుడ్ల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే కొన్ని శాఖాహార ఫుడ్స్ ఉన్నాయి. వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే 10 రకాల వెజిటేరియన్ ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మీల్‍మేకర్
సోయాచంక్స్ (మీల్‍మేకర్)లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మీల్‍మేకర్‌లో సుమారు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యమైన అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి.
పనీర్
పనీర్ (కాటేజ్ చీజ్) రుచికరంగా ఉండటంతో పాటు పోషకాలను కూడా కలిగి ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడి కాయల గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 30 గ్రాముల గుమ్మడి గింజలు సుమారు 8 గ్రాముల ప్రోటీన్‍ను కలిగి ఉంటాయి. పాస్ఫరస్, జింక్ సహా చాలా పోషకాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి.
సోయాబీన్స్
సోయాబీన్స్ ప్రోటీన్‍కు మరో మంచి ఫుడ్. ఉడికించిన 100 గ్రాముల సోయాబీన్‍లో సుమారు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
క్వినోవా
క్వినోవా ధాన్యం ఆరోగ్యానికి మంచిది. కప్పు క్వినోవాలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో గ్లిటెన్ ఉండదు. ముఖ్యమైన అమినో యాసిడ్లను క్వినోవా కలిగి ఉంటుంది.
శెనగలు
శెనగలు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో ఒకటిగా ఉంది. ఉడికించిన 100 గ్రాముల శెనగల్లో సుమారు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
కిడ్నీ బీన్స్ (రాజ్మా)
ప్రోటీన్ ఫుడ్స్ కోసం చూసే వారు కిడ్నీ బీన్స్ కూడా తినొచ్చు. వీటిని రాజ్మా అని కూడా అంటారు. 100 గ్రాముల రాజ్మాలో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పప్పు ధాన్యాలు
కందిపప్పు, మినపపప్పు, ఎర్ర కందిపప్పు సహా పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగానే ఉంటుంది. 100 గ్రాముల పప్పు ధాన్యాల్లో సుమారుగా 25 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది.
గ్రీక్ యగర్ట్
100 గ్రాముల గ్రీక్ యగర్ట్‌లో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సాధారణమైన పెరుగు కంటే దీంట్లో ప్రోటీన్ దాదాపు రెట్టింపు ఉంటుంది.
పచ్చి బఠానీలు
100 గ్రాముల పచ్చి బఠానీల్లో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్, ఫోలెట్, మాంగనీస్ సహా ముఖ్యమైన విటమిన్లు కూడా వీటిలో ఉంటాయి.