Best Web Hosting Provider In India 2024
Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ 8 తెలుగు సోమవారం (నవంబర్ 4) నామినేషన్ల పర్వం రాబోతోంది. పదో వారానికి సంబంధించిన ఈ నామినేషన్లలో ప్రతి ఒక్కరు కేవలం ఒక్కరి పేరే చెప్పే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడంతో ఈ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. అందులో పృథ్వీ, రోహిణి.. హరితేజ, ప్రేరణ.. నిఖిల్, గౌతమ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
బిగ్ బాస్ 8 తెలుగు నామినేషన్లు
బిగ్ బాస్ 8 తెలుగు పదో వారానికి నామినేషన్ల ప్రక్రియ సోమవారం (నవంబర్ 4) హౌజ్ లో జరగనుంది. ఈసారి ఒక్కో కంటెస్టెంట్ కు ఒక్కరినే నామినేట్ చేసే అవకాశం కల్పించారు. దీంతో నామినేషన్ల పర్వం వాడీవేడీగా జరిగినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.
“ఇంటెన్స్ నామినేషన్లు మొదలయ్యాయి. నామినేషన్ ప్రక్రియలో టెన్షన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. స్నేహాలకు ఇది పరీక్ష కానుంది. ఊహించని పేర్తు తెరపైకి రాబోతున్నాయి. ఈ వారం సెగ ఎవరికి తగలబోతోంది” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ ప్రోమోను రిలీజ్ చేసింది.
పృథ్వీ వర్సెస్ రోహిణి
నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమో మొదట్లోనే పృథ్వీ, రోహిణి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్తా టాస్క్ లో నెక్ ఫ్యాంటసీ అనే పదం తనను ఉద్దేశించి ఎందుకు వాడావంటూ రోహిణిని పృథ్వీ నిలదీశాడు. ఫ్యాంటసీ అంటే బ్యాడ్ వర్డ్ కాదు కదా.. ఎందుకు అంతలా ఫీలవుతున్నావంటూ రోహిణి కూడా కాస్త గట్టిగానే వాదించింది.
ఆ తర్వాత హరితేజ, ప్రేరణ మధ్య అయితే మరింత తీవ్రంగా వాగ్వాదం జరిగింది. తనను ప్రేరణ పదే పదే ఫేక్ అనడంపై హరితేజ సీరియస్ అయింది. ఫేక్ అనేది నీకు చిన్న పదంలా అనిపిస్తోందేమోగానీ, అది చాలా పెద్ద పదమని ఆమె క్లాస్ పీకింది. తాను ఫేక్ అని ఎప్పుడూ అనలేదని ప్రేరణ అనడంతో వీళ్ల మధ్య వాగ్వాదం మరింత పెరిగింది.
అటు చివర్లో నిఖిల్, గౌతమ్ మధ్య కూడా మాటా మాటా పెరిగి గౌతమ్ ఛాలెంజ్ విసిరే స్థాయికి చేరింది. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ అతడు రెచ్చిపోయాడు. ఈ వారం నామినేషన్లలో రోహిణి, ప్రేరణ, గౌతమ్ ఉన్నట్లు ప్రోమోలో తేలిపోయింది. ఇక బిగ్ బాస్ 8 తెలుగు 9వ వారం నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో ఇంకా 12 మంది ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న ఆసక్తి నెలకొంది.