Guppedantha Manasu Jagathi: హీరోయిన్‌గా గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి – కిల్ల‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ జ్యోతిరాయ్ తెలుగులో హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు కిల్ల‌ర్ పార్ట్ వ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కిల్ల‌ర్ మూవీ నుంచి జ్యోతిరాయ్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

రోబోగా జ్యోతిరాయ్‌…

ఈ ఫ‌స్ట్‌లుక్‌లో ఓ చేతిలో గొడ్డ‌లితో కూర‌గాయ‌ల బ్యాగ్ భుజానికి త‌ల‌గించుకొని ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో జ్యోతిరాయ్ క‌నిపిస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్‌లో రోబో జ్యోతిరాయ్‌గా మార‌డం ఆస‌క్తిని పంచుతోంది. అద్దంలో జ్యోతిరాయ్ నీడ రోబోగా చూపించారు. కిల్ల‌ర్ మూవీలో రోబోగా, మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా రెండు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో జ్యోతిరాయ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చారు. కిల్ల‌ర్ టైటిల్ కింద ఉన్న డ్రీమ్‌గ‌ర్ల్ అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

భ‌ర్త ద‌ర్శ‌కుడు…ప్రొడ్యూస‌ర్‌…

ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. డైరెక్ష‌న్‌తో పాటు ఓ కీల‌క పాత్ర పోషిస్తూనే ప్ర‌జ‌య్ కామ‌త్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డితో క‌లిసి సుకు పూర్వ‌జ్ కిల్ల‌ర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూన్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం.

పెళ్లి త‌ర్వాత‌…

గ‌తంలో సుకు పూర్వ‌జ్ శుక్ర‌, మాట‌రాని మౌన‌మిది సినిమాలు చేస్తోన్నాడు. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ మాస్ట‌ర్ పీస్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అర‌వింద్ కృష్ణ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో జ్యోతిరాయ్ ఓ కీల‌క పాత్ర పోషించింది. ఏ మాస్ట‌ర్ పీస్ షూటింగ్ జ‌రుగుతోండ‌గానే సుకు పూర్వ‌జ్‌తో ప్రేమ‌లో ప‌డ్డ జ్యోతిరాయ్ అత‌డిని పెళ్లి చేసుకున్న‌ది. పెళ్లి త‌ర్వాత త‌న పేరుకు భ‌ర్త ఇంటి పేరును జోడించి జ్యోతి పూర్వ‌జ్‌గా మార్చుకుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో…

జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ బుల్లితెర అభిమానుల‌ను మెప్పించింది. ఈ సీరియ‌ల్‌లో జ‌గ‌తి గా కొడుకుకు దూర‌మై అత‌డి ప్రేమ కోసం త‌ల్ల‌డిల్లే త‌ల్లి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో ఈ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభంకార్డు వేశారు. జ్యోతిరాయ్ క్యారెక్ట‌ర్ మాత్రం చాలా రోజుల క్రిత‌మే ముగిసింది.

క‌న్న‌డంలో ప‌దిహేను సీరియ‌ల్స్‌…

గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు తెలుగులో క‌న్యాదానం సీరియ‌ల్ చేసింది. క‌న్న‌డంలో ప‌దిహేనుకుపైగా సీరియ‌ల్స్‌లో న‌టించింది. అవ‌న్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. క‌న్న‌డంలో దియా, స‌ప్ల‌య‌ర్ శంక‌ర‌, జెర్సీ నంబ‌ర్ 10తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. ఇక‌పై సీరియ‌ల్స్‌కు దూరంగా ఉంటూ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని జ్యోతిరాయ్ నిర్ణ‌యించుకుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024