TG Rythu Bharosa Update : ఈ నెలాఖరు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు, రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ క్లారిటీ-ఎకరాకు రూ.7500!

Best Web Hosting Provider In India 2024

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సమీకరిస్తుంది. రైతు భరోసా పథకానికి నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒక ఎకరా మొదలుపెట్టి…డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా నిధులు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఎన్నికల ఎకరాల వరకు రైతు భరోసా అందిస్తారో తెలియాల్సి ఉంది. 7.5 లేదా 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కొటి అమల్లోకి తెస్తుంది. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే రైతు రుణ మాఫీ పథకం అమలు చేయగా… తాజాగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా డబ్బులను ఈ నెలాఖరు నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దసరా నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే నిధుల కొరతతో ఆలస్యం అయినట్లు సమాచారం.

45 రోజుల వ్యవధిలో డబ్బులు జమ

తాజాగా రైతు భరోసా నిధులను సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికశాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆరు గ్యారంటీల అమలుపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతుండడతో ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు విషయంపై కొంత గందరగోళం నెలకొంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నవంబర్ చివరిలో ప్రారంభించి డిసెంబర్ లోగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. 45 రోజుల వ్యవధిలో….పది రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల చొప్పున జమ చేసి, మొత్తంగా రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. రాళ్లు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్ల భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. దీనిపై కేబినేట్ సబ్ కమిటీని సైతం నియమించింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే

ఎక్కువ మంది రైతులకు పది ఏకరాల వరకు రైతు భరోసా ఇస్తే సరిపోతుందని గ్రామ సభల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంతమంది 7.5 ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఈ పథకంపై మార్గదర్శకాల డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసింది. ఈ గైడ్ లైన్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner

టాపిక్

Rythu BharosaTelangana NewsGovernment Of TelanganaFarmersAgricultureDbt Schemes
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024