Best Web Hosting Provider In India 2024
Star Maa Serials TRP Ratings: స్టార్ మాతోపాటు జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. 43వ వారానికి సంబంధించిన రేటింగ్స్ ను బార్క్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ పెరిగాయి. అటు జీ తెలుగు సీరియల్స్ మాత్రం కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా సీరియల్స్ ఎప్పటిలాగే టీఆర్పీ రేటింగ్స్ లో దుమ్ము రేపాయి. నిజానికి 43వ వారం ఆ ఛానెల్ సీరియల్స్ రేటింగ్స్ గతంతో పోలిస్తే పెరగడం విశేషం. ఎన్నో నెలలుగా టాప్ లో కొనసాగుతున్న బ్రహ్మముడి సీరియల్ ఈసారి కూడా తొలి స్థానంలోనే ఉంది. అయితే ఈవారం ఈ సీరియల్ రేటింగ్ 13.04కు చేరుకుంది.
రెండో స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ రేటింగ్ కూడా 12.51కి పెరిగింది. ఇక మూడో స్థానంలోకి మరోసారి చిన్ని దూసుకొచ్చింది. ఆ సీరియల్ కు 10.68 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో 10.24 రేటింగ్ తో గుండె నిండా గుడి గంటలు, ఐదో స్థానంలో 9.96 రేటింగ్ తో ఇంటింటి రామాయణం, 9.18తో ఆరో స్థానంలో మగువ ఓ మగువ సీరియల్స్ ఉన్నాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. పడమటి సంధ్యారాగం 7.6 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో, ఆ ఛానెల్లో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మేఘ సందేశం సీరియల్ కి 7.54 రేటింగ్ రాగా.. నిండు నూరేళ్ల సావాసం 7.49, జగద్ధాత్రి 6.7, త్రినయని 6.4, అబ్బాయిగారు 5.72, మా అన్నయ్య 5.41 రేటింగ్స్ సాధించాయి.
చాలా రోజులుగా టాప్ 10 తెలుగు సీరియల్స్ లో తొలి ఆరు స్థానాల్లో స్టార్ మా సీరియల్స్ నిలుస్తుండగా.. తర్వాతి నాలుగు స్థానాల్లో జీ తెలుగు ఛానెల్ కు సంబంధించినవి ఉంటున్నాయి. ఈసారి కూడా అదే కొనసాగింది.
ఈటీవీ, జెమిని సీరియల్స్ రేటింగ్స్
ఈటీవీ విషయానికి వస్తే రంగులరాట్నం మరోసారి 3.6 రేటింగ్ తో తొలిస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత మనసంతా నువ్వే 3.39, గువ్వగోరింక 2.82, రావోయి చందమామ 2.69, శతమానంభవతి 2.25 రేటింగ్స్ సాధించాయి. జెమిని టీవీ సీరియల్స్ లో శ్రీమద్ రామాయణం 1.32 రేటింగ్ తో టాప్ లో ఉంది. ఆ తర్వాత కొత్తగా రెక్కలొచ్చెనా 1.17, సివంగి 1.10, భైరవి 0.99, నువ్వే కావాలి 0.86 రేటింగ్స్ సాధించాయి.