Rusk Halwa: మిగిలిపోయిన రస్కులతో ఇలా హల్వా చేసేయండి, రుచి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

బ్రెడ్ ముక్కలతో హల్వా చేయడం అందరికీ తెలిసిందే. ఒకసారి మిగిలిపోయిన రస్కులతో కూడా హల్వా చేసి చూస్తే రుచి అదిరిపోతుంది. నిజానికి బ్రెడ్ హల్వా కన్నా రస్క్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. మీకు తక్కువ సమయంలో సింపుల్ గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ డ్రెస్ కు హల్వా చేసుకుని చూడండి. ఇరవై నిమిషాల్లో హల్వా రెడీ అయిపోతుంది. పైగా ఎంతో రుచి. దీనిలో అనేక డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాము. కాబట్టి ఈ హల్వా తినడం వల్ల ఆకలి కూడా వేయదు. ఇక హల్వా రెసిపీ తెలుసుకోండి.

రస్క్ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

రస్కులు – ఒక కప్పు

పంచదార – అరకప్పు

నీరు – సరిపడినంత

నెయ్యి – నాలుగు స్పూన్లు

జీడిపప్పులు – గుప్పెడు

ఎండుద్రాక్ష – గుప్పెడు

యాలకుల పొడి – చిటికెడు

కుంకుమపువ్వు – నాలుగు రేకులు

రస్క్ హల్వా రెసిపీ

1. రస్కులను ఒక గిన్నెలో వేసి పొడిలాగా దంచుకోండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో రస్కుల పొడిని వేసి చిన్న మంట మీద వేయించుకోండి. అది వేగాక వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు అదే కళాయిలో నీరు, పంచదార వేసి పాకం వచ్చేదాకా మరిగించుకోండి.

5. పాకం మరుగుతున్నప్పుడే యాలకుల పొడిని, కుంకుమ పువ్వును చల్లుకోండి.

6. ఆ పాకం కాస్త జిగురుగా అవ్వగానే ముందుగా వేయించి పెట్టుకున్న రస్కులు పొడిని అందులో వేసి బాగా కలపండి.

7. అలాగే జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసి బాగా కలుపుకోండి.

8. ఈ మొత్తం దగ్గరగా హల్వాలాగా అయ్యే వరకు ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.

9. అంతే టేస్టీ రస్క్ హల్వా రెడీ అయినట్టే. దీన్ని చేయడం చాలా సులువు.

10. ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పైగా ఎంతో రుచి కూడా దీన్ని చూస్తే మాడుగుల హల్వాలా అనిపిస్తుంది.

11. బ్రెడ్ హల్వా కన్నా ఈ రస్క్ హల్వా టేస్టీగా ఉంటుంది.

ఇంటికి అతిధులను పిలిచినప్పుడు పుట్టినరోజు వేడుకల్లో రస్క్ హల్వా వడ్డించి చూడండి. మీ బంధువులకు నచ్చడం ఖాయం. ఈ రసగుల్లా రెసిపీ కూడా చాలా సులువు. ఒక్కసారి వండారంటే మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. రస్కులు గాలి తగిలి మెత్తగా అయిపోయినప్పుడు వాటిని పడేయకుండా ఇలా హల్వా రూపంలోకి మార్చుకుంటే మంచిది. ఇంకెందుకు ఆలస్యం ఈ రస్క్ హల్వా ప్రయత్నించి టేస్ట్ చూడండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024