Best Web Hosting Provider In India 2024
Vijay Sethupathi Vidudala 2 Theatrical Rights: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ తెచ్చుకుంటున్నాయి. పిజ్జా నుంచి మొన్న విడుదల మహారాజ వరకు చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.
సీక్వెల్ ప్రకటన
అయితే, తమిళంలో గతేడాది సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్‌గా నిలిచింది. విడుదల పార్ట్ 1 అంటూ తెరకెక్కిన చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో విడుదల పార్ట్ 2పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విడుదలకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.
విడుదల 2 ఫస్ట్ లుక్
ఇటివల విడుదల 2 ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి లుక్ అదిరిపోయింది. ఫుల్ ఇంటెన్సివ్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అతి త్వరలో “విడుదల2” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడ్డారు.
వేదాక్షర మూవీస్
కానీ, అధిక మొత్తం చెల్లించి భారీ ఫాన్సీ రేట్‌తో విడుదల 2 చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు. శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు విడుదల పార్ట్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.
కనువిందు చేయనుంది
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. “విడుదల 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది” అని అన్నారు.
కమర్షియల్ వాల్యూస్
“అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం” అని ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు చెప్పారు.
డిసెంబర్ 20న రిలీజ్
“విడుదల 2 తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. డిసెంబర్ 20న విడుదల 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని నిర్మాత చింతపల్లి రామారావు వెల్లడించారు. ఇదిలా ఉంటే, విడుదల 2 సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితోపాటు సూరి, మలయాళ పాపులర్ నటి మంజు వారియర్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇళయరాజా సంగీతం
ఇక విడుదల 2 సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా.. సినిమాటోగ్రఫీని వేల్ రాజా అందించారు. ఇక విడుదల పార్ట్ 1, విడుదల 2 సినిమాలకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వం వహించారు.