Nagula Chavithi Wishes: నాగుల చవితికి మీ బంధుమిత్రులను ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Best Web Hosting Provider In India 2024

అతి ముఖ్యమైన హిందూ పండగల్లో నాగుల చవితి ఒకటి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పండుగ ఇది. ఈ పవిత్రమైన రోజున పాములను పూజిస్తారు. పువ్వులు, పాలు, ప్రత్యేకమైన ప్రసాదాలతో నాగేంద్రుని పూజించి తమకు అదృష్టాన్ని, శ్రేయస్సును ఇమ్మని కోరుతారు. హిందూ పురాణాలలో పాములు ఎంతో ముఖ్యమైనవి. వీటి నుంచి రక్షణ కల్పించమని కోరుతూ నాగుల అధిదేవత అయిన సుబ్రమణ్య స్వామిని పూజిస్తారు. ఈ నాగుల చవితి రోజు బంధుమిత్రులకు శుభాకాంక్షలు పంపే వారి సంఖ్య ఎక్కువే. ఒక అందమైన కోట్స్, విషెస్ తో వారిని నాగుల చవితి రోజు పలకరించండి. మెసేజులను పంపి వారికి నాగుల చవితి రోజు అంతా మంచే జరగాలని కోరుకోండి.

నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో

1. ఈ నాగుల చవితి రోజున

మీ అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని

మనస్పూర్తిగా కోరుకుంటూ

నాగుల చవితి శుభాకాంక్షలు

2. నాగుల చవితి శుభ సందర్భంగా

ఆ శివుడు మీకు బలాన్ని, శ్రేయస్సును

అనుగ్రహించాలని కోరుకుంటున్నాం

హ్యాపీ నాగుల చవితి

3. ఆ శివ శంకరుని మహిమ వల్ల

మీ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ

హ్యాపీ నాగుల చవితి

4. నాగుల చవితి రోజున

మీ అందరిపై శివుడు తన ఆశీర్వాదాలు కురిపించాలని

చెడుతో పోరాడే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ

హ్యాపీ నాగుల చవితి

5. నాగుల చవితి సందర్భంగా

నాగేంద్రుడు మిమ్మల్ని సురక్షితంగా,

ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం

చెడు నుండి పోరాడే శక్తిని

మీకు ప్రసాదించాలని ఆశిస్తున్నాం

మీకు మీ కుటుంబ సభ్యులకు

నాగుల చవితి శుభాకాంక్షలు

6. నాగుల చవితి సందర్భంగా

మీ జీవితంలోని అన్ని కష్టాలను

ఆ సుబ్రమణ్యేశ్వర స్వామి తొలగించాలని కోరుకుంటూ

హ్యాపీ నాగుల చవితి

7. పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన

మీ జీవితం ఆనందమయం అవ్వాలని కోరుకుంటూ

నాగుల చవితి శుభాకాంక్షలు

8. నాగదేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించాలని

చెడు నుండి మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటూ

నాగుల చవితి శుభాకాంక్షలు

9. ఈ పవిత్రమైన నాగుల చవితి సందర్భంగా

పాములకు పాలను పోయండి

శివుడు మీ దారిలో వచ్చే సమస్యలను తొలగిస్తాడు

హ్యాపీ నాగుల చవితి

10. ఆ నాగదేవత మీ కోరికలు తీర్చాలని కోరుకుంటూ

నాగులను గౌరవంగా, భక్తితో పూజించాలని వేడుకుంటూ

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

11. నాగుల చవితి నాడు శివుడు

ఆ నాగదేవుడు తమ దివ్య శక్తితో

మీ జీవితంలో శాంతిని, విజయాన్ని నింపాలని కోరుకుంటూ

హ్యాపీ నాగుల చవితి

12. సర్పదేవతల ఆశీస్సులు

మీ జీవితానికి బలాన్ని, శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నాము

నాగుల చవితి నాడు హృదయపూర్వక శుభాకాంక్షలు

13. దైవ సర్పాలు మీకు మీ కుటుంబానికి

తమ ఆశీర్వాదాన్ని అందించాలని కోరుకుంటూ

నాగుల చవితి శుభాకాంక్షలు

14. సర్పదేవతలు మీకు ఆరోగ్యాన్ని,

ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు

నాగుల చవితి శుభాకాంక్షలు

15. నాగుల చవితికి దైవిక ఆశీర్వాదాలు

మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సును, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం

మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ నాగుల చవితి

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024