CAT 2024 admit card : నేడు క్యాట్​ అడ్మిట్​ కార్డులు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024


అధికారిక నోటిఫికేషన్​ ప్రకారం.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2024 అడ్మిట్ కార్డులను నవంబర్ 5, మంగళవారం రోజున ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కోల్​కతా విడుదల చేయనుంది. క్యాట్ 2024 పరీక్ష నవంబర్ 24న జరుగుతుంది. జనవరి రెండవ వారంలో ఫలితాలను ప్రకటిస్తారు.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష అధికారిక వెబ్సైట్ (iimc.ac.in) నుంచి క్యాట్ 2024 అడ్మిట్ కార్డును డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

క్యాట్ 2024 అడ్మిట్ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

క్యాట్ 2024 అడ్మిట్ కార్డును iimc.ac.in నుంచి డౌన్​లోడ్​ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.

  • – అధికారిక వెబ్సైట్​కి వెళ్లండి. iimcat.ac.in-ఐఐఎం కోల్​కతా అధికారిక వెబ్సైట్​ని సందర్శించి హోమ్​పేజ్​ని చెక్​ చేయండి. క్యాట్ 2024 అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత, లింక్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
  • – మరో విండో ఓపెన్​ అవుతుంది.
  • – అవసరమైన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయండి.
  • – మీ క్యాట్ 2024 అడ్మిట్ కార్డు స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • -భవిష్యత్తు రిఫరెన్స్ కోసం క్యాట్ 2024 అడ్మిట్ కార్డును డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

క్యాట్ 2024 అర్హత..

క్యాట్ 2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన సీజీపీఏ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీస అర్హత మార్కులు 45 శాతం లేదా తత్సమాన సీజీపీఏ.

క్యాట్ 2024 పరీక్షా విధానం..

క్యాట్ 2024 వ్యవధి 120 నిమిషాలు. పరీక్షలో సెక్షన్లు..

సెక్షన్ 1: వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ)

సెక్షన్ 2: డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్)

సెక్షన్ 3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ/క్వాంట్స్)

అభ్యర్థులకు ప్రతి విభాగానికి సమాధానాలు రాయడానికి 40 నిమిషాలు కేటాయిస్తారు.

ఐఐఎంలు అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫెలో / డాక్టరేట్ స్థాయి బిజినెస్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష ఈ క్యాట్​. పలు నాన్ ఐఐఎం సంస్థలు కూడా తమ అడ్మిషన్ ప్రక్రియల్లో క్యాట్ స్కోర్లను ఉపయోగిస్తున్నాయి.

క్యాట్ కేవలం స్క్రీనింగ్ పరీక్షగా మాత్రమే పనిచేస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఐఐఎంల్లో ప్రవేశానికి గ్యారంటీ ఉండదు, అభ్యర్థులు ఆయా సంస్థల అడ్మిషన్ ప్రమాణాల ప్రకారం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ వంటి తదుపరి ఎంపిక రౌండ్లలో పాల్గొనాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఐఐఎంకే అధికారిక వెబ్సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link