Nita Ambani Dress Price: నీతా అంబానీ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర ఊహించగలరా? ఆశ్చర్యపోతారు!

Best Web Hosting Provider In India 2024

ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఖరీదైన దుస్తుల్లో కనిపిస్తుంటారు. భారీ ధరలతో ఉండే లగ్జరీ డ్రెస్‍లు వేసుకుంటారు. నీతా అంబానీ ఎప్పుడు లక్షల ధర ఉండే చీరలు ధరిస్తుంటారు. ఖరీదైన ఆభరణాలు వేసుకుంటారు. నీతా అంబానీ డ్రెస్‍ల ధరలు చాలాసార్లు ఆశ్చర్యం కలిగించాయి. అయితే, కాస్త విభిన్నంగా తాజాగా దుబాయ్‍లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ సింపుల్‍గా కనిపించారు.

నీతా అంబానీ స్టైలిష్ లుక్

ట్రెడిషనల్ ఎథినిక్ లుక్‍‍లో కాకుండా సింపుల్‍ ఔట్‍ఫిట్‍తో ఈ ఈవెంట్‍కు నీతా అంబానీ వచ్చారు. స్టన్నింగ్‍గా ఉన్న ఫ్లోరల్ కో-ఆర్డ్ సెట్ ధరించారు. ఎల్లో, పింక్, గ్రీన్ కల్ షేడ్లలో ఉన్న ఫ్లోరర్ ప్రింట్స్, ఎలాస్టికేడెట్ వైస్ట్ బ్యాండ్, సీమ్ పాకెట్స్ ఉన్న సిల్క్ వైడ్ లెగ్ ప్యాంట్‍ను నీతా అంబానీ ధరించారు. దానికి మ్యాచింగ్‍లో క్లాసిక్ కాలర్, రిలాక్స్డ్ ఫిట్, బటన్ డౌన్ ఫ్రంట్, లాంగ్ స్లీవ్ షర్ట్ వేసుకున్నారు. కంఫర్ట్, క్లాస్ రెండు ఒకే ఔట్‍ఫిట్‍లో ఎలా ఉండాలో ఓ డ్రెస్ ఓ ఉదారణగా నిలిచింది. ఈ డ్రెస్‍లో సింపుల్‍గా, స్టైలిష్‍గా నీతా కనిపించారు.

ధర ఇదే..

నీతా అంబానీ ధరించిన కో ఆర్డ్ సెట్ డ్రెస్ చూసేందుకు సింపుల్‍గా ఉన్నా ధర ఓ రేంజ్‍లోనే ఉంది. ఈ డ్రెస్ జిమ్మర్‌మ్యాన్ బ్రాండ్‍కు చెందనది. ఆ షర్ట్ ధర 525 డాలర్లు (సుమారు రూ.44,163), ప్యాంట్ రేటు 625 డాలర్లు (రూ.51,187 డాలర్లు)గా ఉంది. అంటే మొత్తంగా ఆ డ్రెస్ ధర రూ.95,350 అన్నమాట. అంటే నీతా అంబానీ సింపుల్‍గా ధరించిన డ్రెస్సే దాదాపు రూ.లక్ష వరకు ఉంది. ఈ డ్రెస్ చూసి అంత ధర అంటే చాలా మంది ఆశ్చర్యం కలుగుతుంది. ఇక, డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్, తక్కువ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్‍తో నీతా డిఫరెంట్‍గా కనిపించారు.

కంఫర్టబుల్ ఔట్‍ఫిట్‍లో ముకేశ్, అనంత్

ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ కూడా దుబాయ్‍లో జరిగిన ఈ ఈవెంట్‍లో సింపుల్ ఔట్‍ఫిట్‍ల్లోనే కనిపించారు. వైట్ స్ట్రిప్ట్ టీ షర్ట్, రిలాక్స్డ్ ఫిట్ బ్లూ కలర్ ప్యాంట్, వైట్ స్నీకర్స్ ధరించి ట్రెండీ లుక్‍లో విభిన్నంగా కనిపించారు ముకేశ్. మరోవైపు అనంత్ అంబానీ.. ఓ సైడ్‍లో స్ట్రైకింగ్ టైగర్ ప్రింట్ ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. దీనికి మ్యాచింగ్‍లో బ్లూ డెనిమ్ షార్ట్ వేసుకున్నారు. చేతికి గ్రే కలర్ వాచ్ ధరించారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో లక్షల ఖరీదైన చీరలు ధరించారు నీతా అంబానీ. ఆమె ధరించిన ఓ డైమండ్ నెక్లెస్ హైలైట్‍గా నిలిచింది. ఏకంగా ఆ నెక్లెస్ ధర ఏకంగా రూ.500 కోట్లు ఉంటుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు అందరూ కళ్లు చెదిరే లగ్జరీ ఔట్‍ఫిట్‍లలో మెరిశారు. కోట్లు ఖరీదు చేసే ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024