Best Web Hosting Provider In India 2024
ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. నివృత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఫోన్ చేయాల్సిన నంబర్లు..
9398810958
6281704160
8121947387
8125046997
9398822554
7995649286
7995789286
9505619127
9963069286
9398822618
ఈ నంబర్లకు ఫోన్ చేసి.. తమ సందేహన్ని చెబితే.. నివృత్తి చేస్తారు. ఈ హెల్ప్ డెస్క్ ఉదయం 11.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తుంది. ఈ-మెయిట్ ద్వారా కూడా సందేహాలను నివృత్తి చేయాలనుకునేవారు grievances.tet@apschooledu.in మెయిల్ ఐడీకి తమ సందేహాన్ని పంపాలి. మళ్లీ మెయిల్ ద్వారానే సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
50.79 శాతం క్వాలిఫై..
ఏపీ టెట్-2024 పరీక్షల్లో 1,87,256 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 50.79 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 1ఏ తెలుగు, మైనర్ మీడియా సబ్జెక్టుల్లో 1,04,785 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 65.48 శాతం కాలిఫై అయ్యారు. పేపర్ 1 బీలో ఎస్జీటీ స్పెషల్ స్కూల్స్ పేపర్‌లో 767 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 35.3 శాతం కాలిఫై అయ్యారు.
పేపర్ 2ఏలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌లో 22,080 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 39.58 శాతం క్వాలిఫై అయ్యారు. పేపర్ 2ఏలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సైన్స్ తెలుగు, ఇంగీష్ మీడియంలో 33,525 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 37.97 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2ఏ స్కూల్ అసిస్టెంట్‌లో 24,472 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 40.49 శాతం క్వాలిఫై అయ్యారు. పేపర్ 2బీ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్‌లో 1,627 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 83.09 శాతం క్వాలిఫై అయ్యారు.
ఫలితాలు ఇలా చూడొచ్చు..
ఏపీ టెట్ ఫలితాలను ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://aptet.apcfss.in/CandidateLogin.do ద్వారా చూడొచ్చు. అందులో అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగ్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్