Best Web Hosting Provider In India 2024
Biggest Flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇది. ఇప్పుడు టాలీవుడ్ లోనూ వందల కోట్ల బడ్జెట్ కామనైపోయింది కానీ.. పదేళ్ల కిందట హాలీవుడ్ లో ఏకంగా రూ.270 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.1.7 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే నమ్మగలరా? ఇంత దారుణమైన సినిమా తీసిన డైరెక్టర్.. చివరి నిమిషంలో మూవీ నుంచి తప్పుకున్నాడు.
బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇదే
భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేది.. అంతేకంటే భారీ వసూళ్ల కోసమే. కానీ 2014లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా యునైటెడ్ ప్యాషన్స్ (United Passions) మాత్రం ఈ విషయంలో దారుణంగా బోల్తా పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీగా అపవాదును మూటగట్టుకుంది.
ఫుట్‌బాల్ వ్యవహారాలను చూసుకునే ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) ఎప్పుడు, ఎలా మొదలైందన్న వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఏకంగా 32 మిలియన్ డాలర్ల (ఇప్పటి విలువలో రూ.270 కోట్లు)తో మూవీని తెరకెక్కించారు.
కానీ మొత్తంగా ఈ సినిమా వసూలు చేసింది మాత్రం కేవలం లక్షా 68 వేల డాలర్లు మాత్రమే. అసలు ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఒకటి ఉందని చాలా మందికి తెలియకపోవడమే విచిత్రం.
యునైటెడ్ ప్యాషన్స్.. ఎందుకిలా?
2014లో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అసలు డిస్ట్రిబ్యూటర్లే లేకపోవడం గమనార్హం. అమెరికాలోనూ తొలి వీకెండ్ లో కేవలం 918 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఫిఫా ఎగ్జిక్యూటివ్స్ ను హీరోలుగా చూపించే క్రమంలో అందులో జరిగిన మోసం, బ్యాక్‌డోర్ డీల్స్, అవినీతిని మూవీ పక్కకు పెట్టేసింది.
మూవీ రిలీజ్ కూడా ఫిఫా అవినీతి సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలోనే రిలీజ్ కావడంతో దీనిపై మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సినిమాలకు రేటింగ్ ఇచ్చే రోటెన్ టొమాటోస్ లో అయితే 0 శాతం స్కోరు వచ్చింది. ఐఎండీబీలోనూ కేవలం 2.1 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. ఒక్కటంటే ఒక్క రివ్యూ కూడా పాజిటివ్ గా రాలేదు. ఫిఫాలో జరిగిన అవినీతిని ఎందుకు చూపించలేదో అర్థం కావడం లేదని ఈ మూవీలో నటించిన టిమ్ రోత్ అనడం గమనార్హం.
తన నటన ద్వారా వాటి గురించి చెప్పే ప్రయత్నం తాను చేసినట్లు కూడా చెప్పాడు. యునైటెడ్ ప్యాషన్స్ మూవీ తీసిన డైరెక్టర్ ఫ్రెడ్రిక్ ఆబర్టిన్ చివరి నిమిషంలో అసలు ఈ సినిమాతో తనకు సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడాడు. చివరికి ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా తీసుకోలేదు. సినిమాకు వచ్చిన దారుణమైన నెగటివ్ పబ్లిసిటీ వల్ల ఏ ఓటీటీ హక్కులను కొనే సాహసం చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడా ఈ సినిమా అందుబాటులో లేదు.