NNS 7th November Episode: భాగీని ఇంట్లో నుంచి పంపేసిన శివరామ్​.. ఎగిరి గంతేసిన మనోహరి.. బాధలో ఆరు​​​​​​​​!

Best Web Hosting Provider In India 2024

NNS 7th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 7) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను ఎమ్మెల్యే కొడుకుని నాతో జాగ్రత్తగా ఉండు అని బంటి.. రామ్మూర్తికి వార్నింగ్ ఇస్తాడు. అంజుతో పాటు మిగతా పిల్లలు వచ్చి బంటితో గొడవపడతారు. ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి ఇంకోసారి పిల్లలతో కలిసి తింటే నీ జాబ్ తీసేస్తా అని రామ్మూర్తిని బెదిరిస్తుంది. అది చూసి పిల్లలు ఫీలవుతారు.

భాగీకి రామ్మూర్తి ఫోన్

భాగీకి కాల్ చేసి.. అమ్మా భాగీ.. ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు రామ్మూర్తి. అలాంటిదేం లేదు నాన్న అంటుంది భాగీ. నీ మాట వింటుంటే అనుమానంగా ఉందమ్మా నిజం చెప్పు అమ్మా.. ఎందుకు గొడవ జరిగింది. పిల్లలకు నీకు గొడవ ఎందుకైంది అమ్మ అంటాడు రామ్మూర్తి. నాన్న మీరు మాట్లాడుతుంది పిల్లల గురించా అంటుంది భాగీ.

అవునమ్మా పిల్లలు నాతో సరిగా మాట్లాడటం లేదు అనగానే అది మనోహరి పని నాన్న.. నేను పిల్లలతో మాట్లాడుతా.. అసలు మీరు స్కూల్ దగ్గర ఏం చేస్తున్నారు నాన్న.. స్కూల్‌లో పని మానేశా అన్నారు కదా అంటుంది భాగీ.

భాగీని ఇంట్లో నుంచి పంపించేసిన శివరాం

అమర్ తల్లిదండ్రులు భాగీకి ధైర్యం చెప్తారు. అమర్ గదిలో కూర్చుని మిస్సమ్మ ఆరు చీర కర్టెన్‌గా వేయడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భాగీ అమర్ దగ్గరకు వెళ్లి పిలిస్తే అమర్ మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. ఏం చెప్తావ్ చెప్పు అని అరుస్తాడు. నా జ్ఞాపకం నాశనం చేశావు మనశ్శాంతి కూడా దూరం చేస్తావా అంటాడు కోపంగా. రెండు చేతులు జోడించి దయ చేసి నాకు కనిపించొద్దు అని అరుస్తాడు.

శివరాం అమర్‌ని ఆపుతాడు. మిస్సమ్మ ఇంట్లో వాళ్లని ప్రేమగా చూసుకుంటున్నందుకు నీకు కోపం వస్తుందా. నీ పిల్లలకు తల్లి లేని లోటు తీర్చుతున్నందుకు కోపం వస్తుందా.. ఎందుకు కోపం అని కొడుకుని అడుగుతాడు. బట్టలు సర్దుకోమని మిస్సమ్మని పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చేయ్ అని రాథోడ్‌తో చెప్తాడు శివరాం. ఆరు షాక్ అవుతుంది. మనోహరి మాత్రం ఎగిరి గంతేస్తుంది.

నీ భర్త నీ ముఖం చూస్తే కోపం వస్తుంది అన్నాడు కదా ఇక ఎందుకు వెళ్లిపో అని అంటాడు శివరామ్​. మేం గతంలో ఉన్నాం మాకు భవిష్యత్ అవసరం లేదు అందుకే నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని దెప్పిపొడుస్తాడు. తన భార్య నిర్మలను పంపించి మిస్సమ్మ బ్యాగ్ తీసుకురమ్మని చెప్తాడు. నిర్మల బ్యాగ్ తెస్తుంది. శివరాం మిస్సమ్మని క్షమాపణ అడిగి వెళ్లిపోమని చెప్తాడు.

ప్రిన్సిపాల్‌తో పిల్లల సెల్ఫీ

అమర్ చూస్తుండగానే మిస్సమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఆరు ఏదో ఒకటి చేయండని గుప్తాకి చెప్తుంది. రాథోడ్ మిస్సమ్మని కారులో తీసుకెళ్తాడు. ఆరు ఏడుస్తుంది. మిస్సమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. అమర్ గదిలోకి వెళ్లి ఆలోచనలో పడతాడు.

పిల్లలు ప్రిన్సిపల్ మేడంకి ఓ ఝలక్ ఇవ్వాలని తన గదికి వెళ్లి పొగడ్తలతో ముంచి సెల్ఫీ అడుగుతారు. పిల్లలు సెల్ఫీతో ఏం చేయబోతున్నారు? భాగీని అర్థం చేసుకుని అమర్​ తిరిగి తీసుకొస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024