Best Web Hosting Provider In India 2024
కొన్ని ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని పానియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేసుకోవడం సులువే అయినా చాలా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటిదే ‘వాము-జీలకర్ర నీరు’. ఈ డ్రింక్‌ను సులువుగానే తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా ఈ పానియం తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇవే..
ఎలా తయారు చేసుకోవాలి?
ఈ డ్రింక్ చేసుకునేందుకు ఓ టీ స్పూన్ వాము, ఓ టీస్పూన్ జీలకర్ర, రెండు కప్పుల నీరు తీసుకోవాలి.
ముందుగా ఓ పాత్రలో రెండు కప్పుల నీటిని బాగా మరిగించుకోవాలి. నీరు మరిగాక దాంట్లో ఓ టీ స్పూన్ వాము, ఓ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత మంట సిమ్‌లో పెట్టి నీటిని 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా సన్నని మంటపై మరగనివ్వడం వల్ల ఈ గింజల్లోని ముఖ్యమైన ఆయిల్స్, యాక్టివ్ కాంపౌండ్స్ నీటిలో కలుస్తాయి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పాత్ర దించుకొని నీటిని కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఓ గ్లాసులో వడగట్టుకోవాలి. దీంతో ‘వాము-జీలకర్ర నీరు’ తయారవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే బాగుంటుంది. ఉదయాన్నే పరగడుపున తాగితే ఇంకా మంచిది.
జీర్ణక్రియకు మేలు
‘వాము-జీలకర్ర నీరు’ తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇందులోని ఎసెన్షియల్ ఆయిల్స్, ఇతర గుణాలు జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపించగలవు. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవడానికి తోడ్పడతాయి. ఈ పానియం రెగ్యులర్‌గా తాగితే కడుపు సంబంధించిన సమస్యలు కూడా తగ్గేందుకు సహకరిస్తుంది.
బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతీ రోజు వాము-జీలకర్ర నీరు తాగడం చాలా మేలు. ఇది జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఎక్కువ క్యాలరీలు బర్న్ అయ్యేలా చేస్తుంది. ఎక్కువగా తినాలనే ఆశను కూడా తగ్గించగలదు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులువుగా బయటికి పోయేలా కూడా చేయగలదు. అందుకే బరువు తగ్గేందుకు ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.
రోగ నిరోధక శక్తి
వాము-జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో ఈ డ్రింక్ రెగ్యులర్‌గా తాగితే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుంచి కణాలను ఈ డ్రింక్స్ కాపాడగలదు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ డ్రింక్ రక్షణ కల్పించగలదు.
బ్లడ్ షుగర్ కంట్రోల్
వాము-జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. యాంటీబయాటిక్స్ గుణాలు ఉండడం ఇందుకు తోడ్పడుతుంది. ఇన్సులిన్ సెన్సివిటీని కూడా ఈ వాటర్ పెంచగలదు. సడెన్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నియంత్రించగలదు.
శ్వాసకోశ ఇబ్బందులకు..
శ్వాసకోశ సమస్యలను వాము-జీలకర్ర నీరు తగ్గించగలదు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శ్వాస ఆరోగ్యానికి మంచి చేస్తుంది. జలుబు, దగ్గు లాంటివి తగ్గేందుకు ఈ డ్రింక్స్ ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కూడా తగ్గించగలదు.