Best Web Hosting Provider In India 2024
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. విడుదలకు నెల రోజుల ముందే పుష్ప ది రూల్ ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. పుష్ప 2 టికెట్లు ఓవర్‌సీస్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
నార్త్ అమెరికాలో ఒక్క రోజులోనే పుష్ప 2 పదిహేను వేల టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తం 2750 షోస్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేయగా…అన్నీ హౌజ్‌ఫుల్ అయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 425కే డాలర్స్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు. ఇండియన్ కరెన్సీలో మూడున్నర కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క రోజులోనే పుష్ప 2 దక్కించుకున్నట్లు సమాచారం.
పుష్పను దాటడం ఖాయం…
పుష్ప పార్ట్ వన్ మూవీ నార్త్ అమెరికాలో మొత్తంగా రెండున్నర మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. పార్ట్ వన్ కలెక్షన్స్‌ను అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే పుష్ప 2 దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్…
పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు అరు వందల కోట్లకు అమ్ముడుపోయినట్లు చెబుతోన్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు 400 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. పుష్ప 2 ఓటీటీ హక్కులను 275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లో స్పెషల్ సాంగ్…
ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో అల్లు అర్జున్, శ్రీలీలపై స్పెషల్ సాంగ్‌ను సుకుమార్ షూట్ చేస్తోన్నాడు. ఈ సాంగ్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్వవనున్నట్లు సమాచారం. మరో సాంగ్ షూట్ మిగిలి ఉన్నా ఈ పాట సినిమాలో కనిపించదని అంటోన్నారు. కేవలం ఆడియోలో మాత్రమే వినిపిస్తోందని చెబుతోన్నారు.
ఐదు వందల కోట్ల బడ్జెట్…
పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పాటు సునీల్, అనసూయ విలన్స్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. పుష్ప 2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు ఐదు వందల కోట్లతో ప్రొడ్యూస్ చేస్తోంది.
బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్…
2021లో రిలీజైన పుష్ప ది రైజ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.