PV Sindhu: వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీకి స్టార్ షట్లర్ పీవీ సింధు భూమిపూజ

Best Web Hosting Provider In India 2024


విశాఖపట్నంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. పీవీ సింధు సెంటర్‌ బ్యాడ్మింటన్ – స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్‌ ఏర్పాటుతో క్రీడా రంగానికి ఈ షట్లర్ తన వంతు సాయం చేయడానికి చొరవ తీసుకుంది. ఈ సెంటర్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు పీవీ సింధు తెలిపింది. విశాఖపట్నం పరిధిలోని అరిలోవా ఏరియాలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులకు గురువారం తన తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు భూమి పూజ చేసింది.

పీవీ సింధు మాట్లాడుతూ ‘‘వైజాగ్‌లోని ప్రజల కోసం ఈ సెంటర్‌ను నిర్మిస్తున్నాను.నా ఈ లక్ష్య సాధన కోసం ఒక స్థానాన్ని ఎంపిక చేసుకోవడానికి అద్భుతమైన నగరాల్లో వైజాగ్ కంటే మెరుగైన స్థలాన్ని నేను ఊహించలేకపోయాను. ఈ కేంద్రం అన్ని స్థాయిల అథ్లెట్లకి శిక్షణతో పాటు, అంకితభావం, క్రమశిక్షణ నేర్పించి కొత్త తరాన్ని క్రీడా నైపుణ్యాలున్న భవిష్యత్ కోసం మార్గనిర్దేశం చేసేందుకు గమ్యస్థానంగా ఉండనుంది. వ్యక్తిగతంగా నా ఆలోచనలను ప్రతిబింబించే ప్రాజెక్ట్ ఇది.

ఒలింపియన్‌గా నన్ను నిలబెట్టి.. నా ప్రయాణానికి మద్దతునిచ్చిన క్రీడా సమాజానికి మళ్లీ తిరిగి ఏదైనా ఇవ్వాలనే ధృఢ సంకల్పంతో రూపుదిద్దుకున్నది ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన. ముఖ్యంగా యువ క్రీడాకారులకి ప్రపంచ స్థాయి శిక్షణ పొందడంతో పాటు, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మద్దతును అందించగలిగే క్రీడా శిక్షణ వేదికను నిర్మించాలని నేను కలలు కన్నాను.

ఈ కేంద్రం కేవలం క్రీడాకారులకి సదుపాయాలను అందించడానికి మాత్రమే కాకుండా విభిన్నమైన కోణాల్లో క్రీడాకారులకి సహాయపడేలా ఏర్పాటు చేస్తాం. బ్యాడ్మింటన్‌ సవాళ్లను ఎదుర్కొవడంలో నెక్ట్స్ జనరేషన్‌కి దారి చూపడం, మార్గనిర్దేశం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను’’ అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.

గ్రీన్‌కోతో కలిసి ఈ సెంటర్‌ను వైజాగ్‌లో పీవీ సింధు ఏర్పాటు చేయబోతోంది. గ్రీన్‌కో భాగస్వామ్యంతో పాటు పుల్లెల గోపీచంద్ మద్దతుతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పీవీ సింధు పేర్కొంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link