KTR Comments : ‘రేవంత్.. కేసు పెడితే పెట్టుకో – జైలుకు వెళ్లడానికి సిద్ధమే..! మళ్లీ వచ్చి పాదయాత్ర చేస్తా’ – కేటీఆర్

Best Web Hosting Provider In India 2024

ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డి వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..ఫార్ములా-ఈ రేస్ ఈవెంట్ పై మాట్లాడారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఫార్ములా-ఈ రేస్ తెచ్చి ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం షేమ్ తెచ్చడంటూ సెటైర్లు విసిరారు. అలాంటి రేవంత్ రెడ్డినా… ఒలంపిక్స్ క్రీడలు నిర్వహించేది? అంటూ ప్రశ్నించారు. అసలు ఒలంపిక్స్ కు ఎంత ఖర్చు అవుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ నగరంలో ఎఫ్1 జరపాలనేది రెండు దశాబ్దాల కల అని కేటీఆర్ చెప్పారు. 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబునాయుడు హైదరాబాద్లో ఎఫ్1 నిర్వహించాలని ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. గురువు చంద్రబాబు కన్న కలను శిష్యుడు రేవంత్ రెడ్డి నెరవేర్చలేదు కానీ తాము నెరవేర్చాం అంటూ చెప్పుకొచ్చారు.

ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే…

కామన్వెల్త్ గేమ్స్ కోసం యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 70,600 కోట్లు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసిందన్నారు. ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లు జరిగిన సరే ప్రభుత్వం వాటికోసం ఖర్చు చేస్తోందని చెప్పారు. తమిళనాడులో కూడా జరిగిన ఫార్ములా 4 అనే రేసు కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశారన్నారు.

“ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఈ నగరాల చోట హైదరాబాద్‌ను చేర్చాలని మేము ఈ-రేస్‌ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం. మేము ఈ-రేస్ తెచ్చేందుకు చేసి ప్రయత్నంలో సియోల్, జోహన్నస్‌బర్గ్‌ను తలదన్ని మన హైదరాబాద్‌కు ఈ-రేస్‌ను తెెచ్చాం. ఫార్ములా రేసింగ్‌ను మేము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనుకున్నాం. మేము ఈ-రేస్‌కు కోసం ప్రభుత్వం తరపున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే. కానీ హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పింది. ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు పెట్టుబడులు తెచ్చాం” అని కేటీఆర్ వివరించారు.

హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు – కేటీఆర్

“నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్‌కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్‌కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుంది. వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా తెలుసు ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అరవింద్ కుమార్ గారి తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు.. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశాం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశాం. కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే వాళ్లకు తెలిసిన పని. కానీ నిర్మాణం చేయటం వారికి తెలియదు.

ఇందులో ఉచ్చు ఏముంది..?

“రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. మనకు రూ. 700 కోట్లు లాస్ వచ్చింది కొందరు రాస్తున్నారు కేటీఆర్ చుట్టు ఉచ్చు అని. దీనిలో ఉచ్చు అనేది ఏముంది..? నిజానికి హైదరాబాద్‌లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు ఆయనపైనే కేసు పెట్టాలి. ఏసీబీ ఫుల్‌ఫామ్ రేవంత్ రెడ్డికి తెలుసా? అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముంది?

“నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవ్వాళ ఓ పేపర్‌లో టార్గెట్ కేటీఆర్ అని రాశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హమీలపై కదా వాళ్ల టార్గెట్ ఉండాల్సింది. కేసు పెడితే పెట్టుకో… రెండు మూడు నెలలు జైల్లో ఉండి మంచిగా యోగా చేసుకొని ట్రిమ్‌గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. రేవంత్ రెడ్డి కనీసం తెలుసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తియ్యకు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని రాజ్ భవన్‌లో ప్రయత్నం చేశారు అయినా సరే నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ప్రజల తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Whats_app_banner

టాపిక్

Cm Revanth ReddyKtrBrsCongress
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024