Bengali Chicken Curry: బెంగాలీ స్టైల్‌లో చికెన్ కూర వండి చూడండి, అన్నంలో కలుపుకుంటే ఆ రుచే వేరు

Best Web Hosting Provider In India 2024


చికెన్ కూర పేరు చెబితేనే నాన్ వెజ్ ప్రియులు ఆగలేరు. ప్రతిరోజూ చికెన్ కూర తినేవారు కూడా ఉన్నారు. ప్రతి వారాంతంలో చికెన్ వంటకాల్లో కొత్త రెసిపీని ప్రయత్నించేవారు ఎంతో మంది. ఇక్కడ మేము బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చెప్పాము. స్పైసీగా ఉండే బెంగాలీ చికెన్ రిసిపి తినడానికి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కర్రీని అన్నంతో తింటే అదిరిపోతుంది. ఈ అన్నంలో కూరను కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. దీన్ని కేవలం అన్నంలోనే కాదు రోటీ లేదా చపాతీతో కూడా తినవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా బెంగాలీ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

బెంగాలీ చికెన్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ – కిలో

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను

పెరుగు – ఒక కప్పు

జీడిపప్పులు – గుప్పెడు

గసగసాలు – రెండు స్పూన్లు

పచ్చిమిర్చి – అయిదు

నూనె – రెండు స్పూన్లు

నెయ్యి – నాలుగు స్పూన్లు

లవంగాలు – మూడు

మిరియాల పొడి – పావు స్పూను

దాల్చిన చెక్క ముక్క – చిన్న ముక్క

ఉప్పు – రుచికి సరిపడా

గరం మసాలా – ఒక స్పూను

ఉల్లిపాయ పేస్ట్ – రెండు స్పూన్లు

పచ్చి యాలకులు – రెండు

ఎండుమిర్చి – అయిదు

కుంకుమపువ్వు – చిటికెడు

బెంగాలీ చికెన్ కర్రీ రెసిపీ

  1. బెంగాలీ చికెన్ వండడానికి ముందు చికెన్ ను మ్యారినేట్ చేసుకోవాలి.
  2. ఒక పాత్రలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి.
  3. దీని తరువాత జీడిపప్పు, గసగసాలను, వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తరువాత మిక్సీలోవాటిని, పచ్చిమిర్చిని వేసి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, నెయ్యి వేయాలి.

5. నెయ్యి వేడెక్కాక లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి వేసి వేయించాలి.

6. ఆ మిశ్రమంలోనే మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి.

7. అందులోనే జీడిపప్పు, గసగసాల పేస్ట్, ఉప్పు, గరంమసాలా పొడి వేసి బాగా కలపాలి.

8. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, కప్పు నీళ్లు, ఉప్పు వేసి అన్నీ బాగా కలపాలి.

9. మంట తగ్గించి కళాాయిపై మూతపెట్టి అరగంట పాటూ ఉడికించాలి.

10. చికెన్ బాగా ఉడికిన తర్వాత చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసి చికెన్ బాగా కలపాలి. అది ఇగురులాగా అయ్యేదాకా ఉడికించాలి.

11. కుంకుమపువ్వును రెండు టీ స్పూన్ల పాలలో వేసి బాగా నానబెట్టాలి. ఆ పాలను కూరలో వేసి బాగా కలుపుకోవాలి.

12. చికెన్ ముక్క ఉడికాక స్టవ్ కట్టేయాలి. అంటే బెంగాలీ స్టైల్ లో చికెన్ కర్రీ రెడీ అయినట్టే.

బెంగాలీ స్టైల్ లో చేసిన చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో సింపుల్ గా చేసి చూడండి మీకు కచ్చితంగా నచ్చి తీరుతుంది.

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024