Best Web Hosting Provider In India 2024
IDBI ESO Recruitment 2024: ఐడీబీఐ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల భర్తీకి నోటిషికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ idbibank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్
ఐడీబీఐ బ్యాంక్ (IDBI) లో ఎగ్జిక్యూటివ్ – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభమై 2024 నవంబర్ 16న ముగుస్తుంది. ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ 1, 2024 న జరుగుతుంది.
రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు
- యూఆర్: 448 పోస్టులు
- ఎస్టీ: 94 పోస్టులు
- ఎస్సీ: 127 పోస్టులు
- ఓబీసీ: 231 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్: 100 పోస్టులు
- పీడబ్ల్యూబీడీ: 40 పోస్టులు
అర్హతలు
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వం/ ప్రభుత్వ సంస్థలు అంటే ఏఐసీటీఈ, యూజీసీ మొదలైన వాటి ద్వారా గుర్తింపు పొందిన/ ఆమోదించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి అక్టోబర్ 2, 1999 – అక్టోబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
ఎంపిక విధానం
సెలక్షన్ ప్రధానంగా ఆన్ లైన్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ), ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT) ల అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఆన్లైన్ పరీక్షలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ కంప్యూటర్/ ఐటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది. అభ్యర్థి తప్పు సమాధానం ఇస్తే ప్రతి ప్రశ్నకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు లేదా 0.25 కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250, ఇతర అభ్యర్థులకు రూ.1050 (అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు) దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link