Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial today november 8th episode: శౌర్య తాను తీసిన ఫోటోను కాంచన వాళ్ళకు చూపిస్తుంది. అది చూసి తెగ మురిసిపోతారు. అమ్మానాన్న ఫోటో ఎంత బాగుందోనని శౌర్య అంటే ఫోటో ఎప్పుడు తీశావని దీప కోపంగా అరుస్తుంది. అనసూయ మాత్రం శౌర్యను మాట కూడా అననివ్వకుండా మీ ఆయన సంగతి చూసుకో అనేసరికి దీప వెళ్ళిపోతుంది.
వీపీని అయిపోయాను
ఫంక్షన్ కు నువ్వే మీ అమ్మను ఒప్పించాలి. లేదంటే మీ అమ్మానాన్న విడిపోతారు. అలా జరగకూడదు అంటే నువ్వే ఒప్పించాలని అనసూయ శౌర్యకు చెప్తుంది. స్వప్న, కాశీ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటారు. వదిన ఒప్పుకుంటుందో లేదోనని కాశీ డౌట్ పడతాడు.
స్వప్న శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది. కాశీ వాయిస్ విని తాను మాట్లాడనని శ్రీధర్ కావేరీకి ఫోన్ ఇచ్చేస్తాడు. మావయ్యను తీసుకుని వస్తున్నారా అని కాశీ అడిగితే తీసుకొస్తాను అల్లుడు గారు అని ఒకటికి వంద సార్లు పిలుస్తుంది. ఏం జరుగుతుంది ఇంట్లో వీపీని అయిపోయానే అని శ్రీధర్ తెగ బాధపడిపోతాడు.
పగతో రగిలిపోతున్న శ్రీధర్
రిసెప్షన్ చేస్తాను అంటే దీప ఎలా ఒప్పుకుంది. నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి కారణం దీప నా కూతురి పెళ్లి చేయడం. నిన్ను బాధపెట్టడం కోసమైన నేను రిసెప్షన్ కు వచ్చి నీ పరువు తీస్తానని శ్రీధర్ పగతో రగిలిపోతాడు. రిసెప్షన్ కు ఎందుకు ఒప్పుకోను అంటున్నానో వీళ్ళకు అర్థం కావడం లేదు.
కార్తీక్ బాబును దక్కించుకోవడానికి జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. ఇక నేను రిసెప్షన్ చేసుకుంటే జ్యోత్స్న ఊరుకుంటుందా? కార్తీక్ బాబును తలదించుకునేలా చేస్తుంది. కార్తీక్ బాబు పక్కన భార్య స్థానంలో కూర్చునే స్థాయి నాది కాదని వాళ్ళ స్నేహితులే అన్నారు.
స్వార్థపరురాలివి దీప
ఇక అలాంటప్పుడు నేను ఎలా ఉంటానని దీప అనుకుంటుంది. అందరూ భోజనానికి వస్తే శౌర్య ఎక్కడని అనుకుంటారు. శౌర్య గదిలో కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడతారు. నేను నా కూతురి సంతోషం కోసం బతుకుతాను అంటావ్ కానీ అది అబద్ధం దీప నువ్వు స్వార్థపరురాలివి.
ఎంత సేపు నీ భయాలే తప్ప ఎదుటి వారి ఆనందం గురించి ఆలోచించవు. ఎవరో ఏదో అనుకుంటారని దాంట్లోనే బతుకుతున్నావ్. నన్ను అన్నట్టే దాన్ని ఏదో అని ఉంటావు అది ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అది బాధపడకూడదని ముందే చెప్పాను.
నాకు అమ్మానాన్న కావాలి
దానికి ఏమైనా అయితే నిన్ను క్షమించను. నాకు శౌర్య కంటే ఎవరూ ఎక్కువ కాదని దీపకు వార్నింగ్ ఇస్తాడు. శౌర్య ఒక చోట కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నీకు ఏం కావాలని కార్తీక్ అడిగితే ఒక డ్రాయింగ్ చూపించి అది కావాలని శౌర్య అడుగుతుంది.
నాకు అమ్మానాన్న కావాలి. వీళ్ళు నా అమ్మానాన్న కాదు. కలిసి ఉండాలి కానీ వీళ్ళు అలా ఉండటం లేదు. మా అమ్మానాన్న అలా లేరు. నాకు ఎప్పుడూ అమ్మ ఉండేది నాన్న ఉంటే బాగుండు అనిపించేది. కానీ ఇప్పుడు నాన్న ఉన్నాడు కానీ అమ్మ లేదు అంటే నేను ఉన్నాను కదాని దీప అంటుంది.
నాతో ప్రేమగా ఉండటం లేదు
ఇంతకముందులాగా ప్రేమగా లేవు. నాకు నువ్వు అన్నం తినిపించడం లేదు. నేను ఏమడిగినా ఇచ్చే దానివి కానీ ఇప్పుడు ఏది అడిగినా కోప్పడుతున్నావ్ నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావ్. నేను ఏడుస్తున్నాను నాతో ప్రేమగా ఉండమ్మా. నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నట్టే మీరు నాతో ఉండాలని అనుకోవడం తప్పా?అని అడుగుతుంది.
శౌర్య అడుగుతుంది సమాధానం చెప్పమని కార్తీక్ అంటాడు. నేను చెప్పకపోయిన అదంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలియదా అంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావ్ నేనంటే నీకు ప్రేమ లేదు. నేనంటే నీకు ప్రేమ ఉంటే ఫంక్షన్ కు ఒప్పుకోమ్మా అని శౌర్య అడుగుతుంది.
తల్లిదండ్రుల ప్రేమ కోసం శౌర్య ఆరాటం
ఈ బొమ్మలో ఉన్నట్టు మీరు ఎప్పుడైనా నాతో ఉన్నారా? అందుకే నాకు ఎవరూ వద్దు. శౌర్యకు ఎవరూ లేరు. నాకోసం ఎవరూ ఏం చేయరు అని ఏడుస్తుంది. అది బాధపడితే నేను చూడలేను ఏం చేయాలని కార్తీక్ దీపను నిలదీస్తాడు. నేను ఎప్పుడూ అమ్మను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను.
అందుకే నేను ఎక్కడికో వెళ్లిపోతానని శౌర్య అంటుంది. అమ్మానాన్న విడిపోతే నేను బాధపడతాను. నేను ఉంటే అమ్మ బాధపడుతుంది. అందుకే నేనే వెళ్లిపోతానని అంటుంది. నువ్వు వెళ్లిపోతే నేను ఎవరి కోసం బతకాలి అని శౌర్యను హగ్ చేసుకుని దీప ఏడుస్తుంది.
అయితే ఫంక్షన్ కు ఒప్పుకో మీరిద్దరూ ఫంక్షన్ చేసుకుంటే చూడాలని అనిపిస్తుంది. మా హ్యాపీ పేరెంట్స్ ను మా ఫ్రెండ్స్ కు చూపించాలి. అలా చూపించాలంటే నువ్వు ఫంక్షన్ కు ఒప్పుకో అని శౌర్య బాధగా అడుగుతుంది. దీంతో దీప రిసెప్షన్ కు సరే అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్