Best Web Hosting Provider In India 2024
భారతీయ వంటల్లో కరివేపాకును వాడడం సర్వసాధారణం. ఇది ఆహారం రుచిని, వాసనను పెంచుతుంది. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.
ఆయుర్వేదంలో కరివేపాకు, చెట్ల బెరడులను అనేక రోగాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కరివేపాకును సాంబార్ నుంచి చట్నీ వరకు అనేక రకాలుగా వినియోగిస్తుంటారు. కానీ చాలా మంది కరివేపాకులను కూరల్లో నుంచి ఏరి పక్కన పడేస్తారు. వాటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి కరివేపాకులను రోజూ తింటే డయాబెటిస్ బారిన పడే అవకాశం తగ్గిపోతుంది. అంతేాకాదు మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ కరివేపాకులను ఆహారంలో భాగంలో చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
కరివేపాకులో పోషకాలు
ఈ ఆకుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాపర్, క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు, అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
డయాబెటిక్ పేషెంట్ల కోసం
కరివేపాకులు డయాబెటిక్ పేషెంట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే హైపోగ్లైసీమిక్ కంటెంట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. కరివేపాకులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గడమే కాకుండా ఇప్పటికే సమస్య ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకులను పచ్చడి రూపంలో ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. లేదా పొడిలా మార్చుకుని గోరువెచ్చనిన నీళ్లలో వేసుకుని తాగండి. కూరల్లో వేసిన కరివేపాకులను తినేసినా మంచిదే. ఎలాగైనా కరివేపాకులను తినడం ముఖ్యం. ఇది డయాబెటిస్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
కరివేపాకులో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అజీర్ణం, గ్యాస్, పొట్ట సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మృదువుగా ఉంటుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తహీనత
రక్తహీనత సమస్య నుంచి బయటపడేందుకు కరివేపాకులు ఎంతో ఉపయోగపడతాయి. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తహీనతను నయం చేయడానికి సహాయపడతాయి. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనతను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో శక్తిని ఉంచుతుంది.
జుట్టు రాలకుండా…
కరివేపాకులో జుట్టు రాలడాన్ని నివారించే గుణాలు ఉంటాయి. కరివేపాకులు తినడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది. జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. అలాగే కరివేపాకును పేస్ట్ చేసి జుట్టుకు అప్లై చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకు తినడం వల్ల నోటి పూత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఆకులు బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.