Best Web Hosting Provider In India 2024
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. “నమ్మ బెంగళూరు ఛాలెంజ్-2024”ను ప్రకటించారు. టెక్ క్యాపిటల్ భవిష్యత్తు కోసం పనగరంలోని ప్రాబ్లమ్ సాల్వర్స్ ఈ ఛాలెంజ్‌ని చేపట్టాలని పిలుపునిచ్చారు. బెంగళూరు భవిష్యత్తును అన్ని విధాలుగా తీర్చిదిద్దే ఆలోచనలతో ముందుకు వచ్చే ఛేంజ్ మేకర్లకు రూ.50 లక్షల గ్రాంట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు.
“బెంగళూరు నాకు అన్నీఇచ్చింది. ఎన్ని సవాళ్లు ఉన్న ఈ నగరం ఒక ప్రత్యేకమైన స్థితిస్థాపకతను కలిగి ఉంది. బెంగళూరువాసులు, ముఖ్యంగా కేఫ్‌లు, అర్థరాత్రి వర్క్ స్పేస్‌లలో మేధోమథనం చేసేవారు దేనికైనా పరిష్కారాలను కనుగొనగలరని నేను నమ్ముతున్నాను. బెంగళూరు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరింత మంది ఛేంజ్ మేకర్లు అవసరం,” అని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో నిఖిల్ కామత్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నమ్మ బెంగళూరు ఛాలెంజ్‌ని ప్రకటించారు.
నమ్మ బెంగళూరు ఛాలెంజ్ అంటే ఏటి?
నమ్మ బెంగళూరు ఛాలెంజ్ నగరంలోని ప్రజలను ఆచరణాత్మక, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుంది! నగరంలో జీవితాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుందని కామత్ భావిస్తున్నారు. అయితే, సమస్యల పరిష్కారానికి ఆలోచనలు ఇచ్చే వారు, వాటిని పాటించాలి కూడా! ఆ ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉండాలి. ఈ ఛాలెంజ్ కోసం మొత్తం రూ.50 లక్షల గ్రాంటును కేటాయించి, షార్ట్ లిస్ట్ చేసిన ఐడియాలకు వాటిని అమలు చేస్తామని నిఖిల్ కామత్ అన్నారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
ప్రభావవంతమైన ఆలోచనలు ఉన్నవారు అధికారిక వెబ్సైట్ (https://www.unboxingblr.com/namma-bengaluru-challenge) ద్వారా సవాలును స్వీకరించడానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రాజెక్టు గురించి, అది పరిష్కరించే సమస్య గురించి, ప్రతిపాదిత పరిష్కారం గురించి సమగ్ర సమాచారాన్ని అందించాలి. ప్రతిపాదిత పరిష్కారం బెంగళూరుకు ఎందుకు ముఖ్యమో వివరిస్తూ 5 నిమిషాలలోపు చిన్న ఇంట్రో వీడియోను సమర్పించాలి.
ప్రక్రియ..
సెలక్షన్ ప్యానెల్ మీ ఆలోచనలను షార్ట్ లిస్ట్ చేస్తుంది. అభ్యర్థులను సెలక్షన్ ప్యానెల్‌తో వర్చువల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులతో ప్రతిపాదిత ఆలోచనలను ప్యానెల్ మరింత లోతుగా తవ్వనుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులు గ్రాంట్లు అందుకుంటారు. బెంగళూరును నివాసితులకు మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మిషన్‌ని ప్రారంభించమని అడుగుతారు.
మరోవైపు బీఎల్ఆర్ హుబ్బాలో భాగంగా డిసెంబర్ 13న బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రత్యేక ఈవెంట్ జరగనుంది. దీని పేరు అన్బాక్సింగ్ బీఎల్ఆర్. నమ్మ బెంగళూరు ఛాలెంజ్‌లో ఎంపికైన అభ్యర్థులు తమ ఆలోచనలను నిపుణులైన జ్యూరీకి సమర్పించాల్సి ఉంటుంది.
బెంగళూరు మహా నగరంలో ఉన్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్! బెంగళూరు ట్రాఫిక్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. అదే సమయంలో నగరంలో నీటి కొరత కూడా అధికంగానే ఉంది. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ చేసిన ప్రకటనని అందరు అభినందిస్తున్నారు. మరి దీని ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link