HAL Non Executive Jobs: హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

Best Web Hosting Provider In India 2024

HAL Non Executive Jobs: ప్రభుత్వ రంగంలో మహారత్న కంపెనీగా గుర్తింపు పొందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ హైదరాబాద్ ఏవియేషన్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నాలుగేళ్ల వ్యవధితో టెక్నిషియన్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

దక్షిణాసియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ సంస్థకు ప్రొడక్షన్, ఓవర్ హాలింగ్ సర్వీస్ వి‎భాగాల్లో గుర్తింపు ఉంది. ఈ సంస్థకు 9 ఆర్‌ అండ్ డి కేంద్రాలు, ఫేసిలిటీ మేనేజ్మెంట్‌ కేంద్రాలు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్‌ క్రాఫ్ట్‌, హెలికాఫ్టర్‌, ఏరో ఇంజిన్స్‌, ఇండస్ట్రియల్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్‌ డిజైనింగ్, టెక్నాలజీ, డెవల్‌ప్‌‌మెంట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, రిపేర్‌, ఓవర్‌హాలింగ్ విభాగాల్లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ గుర్తింపు పొందింది.

హైదరాబాద్‌లో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఏవియేషన్‌ విభాగంలో అర్హులైన నాలుగేళ్ల కాల వ్యవధిలో నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్లోమి టెక్నిషియన్స్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నాలుగేళ్ల తర్వాత కాంట్రాక్టు రద్దైపోతుంది. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారి కాంట్రాక్టులను పొడిగించే అధికారం హెచ్‌ఏఎల్‌కు ఉంటుంది.

పోస్టుల వివరాలు…

మెకానికల్ డిప్లొమా టెక్నిషియన్‌ పోస్టులు 8, మెకానికల్ డిప్లొమా ఎఫ్‌ఎస్‌ఆర్ టెక్నిషియన్లు 2, ఎలక్ట్రికల్ డిప్లొమా టెక్నిషియన్లు 2, ఎలక్ట్రికల్ డిప్లోమా ఎఫ్‌‌ఎస్‌ఆర్‌ టెక్నిషియన్లు 1. ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా టెక్నిషియన్ పోస్టులు21, ఎలక్ట్రానిక్స్‌ ఎఫ్‌ఎస్‌ఆర్ టెక్నిషియన్ పోస్టులు 14, కెమికల్ డిప్లొమా టెక్నిషియన్ పోస్ట్ 1, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆపరేటర్ పోస్ట్ 1, ఫిట్టర్ 1, పెయింటర్ 2, టర్నర్ 1 పోస్టు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 14.5శాతం మాజీ సైనికోద్యోగులకు కేటాయిస్తారు.

ఎంపికైన అభ్యర్థుల్ని శ్రీనగర్‌, సిర్సా, భటిండా, బరేలి, గోరఖ్‌పూర్‌, గ్వాలియర్‌, తేజ్‌పూర్‌, చౌబా, బడ్గోరా, బీదర్, కలైకుండా, పూణే, భుజ్‌, జామ్‌నగర్‌, జోద్‌పూర్‌, ఉత్తర్‌లై, మమ్నం, గోవా వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు…

డిప్లొమా టెక్నిషియన్ మెకానికల్ పోస్టులకు పదవ తరగతి తర్వాత గుర్తింపు పొందిన బోర్డు యూనివర్శిటీ నుంచి మూడేళ్ల మెకానికల్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కోటాలో దరఖాస్తు చేసే వారు ఆర్మీ, నేవీ, వాయుసేనలో డిప్లొమా హోదాలో పనిచేసి ఉండాలి.

డిప్లొమా టెక్నిషియన్ ఎలక్ట్రికల్ పోస్టులకు పదవ తరగతి తర్వాత గుర్తింపు పొందిన బోర్డు యూనివర్శిటీ నుంచి మూడేళ్ల ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కోటాలో దరఖాస్తు చేసే వారు ఆర్మీ, నేవీ, వాయుసేనలో సంబంధిత డిప్లొమా కోర్సుతో పనిచేసి ఉండాలి. ఎయిర్‌ క్రాఫ్ట్‌, రాడార్ విభాగాల్లో చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

డిప్లొమా టెక్నిషియన్ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులకు పదవ తరగతి తర్వాత గుర్తింపు పొందిన బోర్డు యూనివర్శిటీ నుంచి మూడేళ్ల ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కోటాలో దరఖాస్తు చేసే వారు ఆర్మీ, నేవీ, వాయుసేనలో సంబంధిత డిప్లొమా కోర్సుతో పనిచేసి ఉండాలి. ఎయిర్‌ క్రాఫ్ట్‌, రాడార్ విభాగాల్లో చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఆపరేటర్ పోస్టులకు 10వ తరగతి తర్వాత ఐటిఐ, ఎన్‌ఏసి విద్యార్హత కలిగి ఉండాలి. ఎన్‌ఏసి శిక్షణ పొందిన వారు మూడేళ్ల శిక్షణ పూర్తి చేసి ఉండాలి. అప్రంటీస్ మూడేళ్ల పాటు పూర్తి చేసుకున్న వారు ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్, ఫుల్‌టైమ్ పద్ధతిలో పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి ఎనిమిది వారాల శిక్షణ ఉంటుంది.

వేతనం…

డిప్లొమా టెక్నిషియన్లకు రూ23వేల బేసిక్‌తో కూడిన వేతనం చెల్లిస్తారు. ఆపరేటర్ పోస్టులకు రూ.22వేల బేసిక్ వేతనం చెల్లిస్తారు. బేసిక్ వేతనంతో పాటు క్వార్టర్లీ ప్రాతిపదికన డిఏ చెల్లిస్తారు. క్వార్టర్‌ ఇవ్వకపోతే హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. బేసిక్‌ వేతనంపై 25శాతం అలవెన్సులు అదనంగా చెల్లిస్తారు. ఇందులో మీల్ కార్డు, ఓచర్లు, కన్వేయన్స్‌ అలవెన్స్‌, మ్యాగ్‌జైన్ అలవెన్స్‌, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌ అలవెన్స్‌, స్పెషల్ అలవెన్స్‌ ఉంటాయి. వార్షిక వేతన పెంపు ఉంటుంది. నైట్ షిఫ్ట్‌ అలవెన్స్‌ కూడా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఈ లింకును అనుసరించండి….

https://hal-india.co.in/career-details

Whats_app_banner

టాపిక్

JobsHyderabadGovernment Jobs
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024