Best Web Hosting Provider In India 2024
Vijay Deverakonda: స్టార్ హీరోలు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌లో కనిపించడం అనే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు ఆడపాదడపా వీడియో సాంగ్స్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ బాలీవుడ్ హీరోల బాటలో విజయ్ దేవరకొండ అడుగులు వేయబోతున్నాడు. కెరీర్‌లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్ చేయబోతున్నాడు. మ్యూజిక్ వీడియో సాంగ్‌లో కనిపించనున్న ఫస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోగా నిలవనున్నాడు
రాధికా మదన్ జోడి…
సాహిబా అనే టైటిల్‌తో ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్ అవుతోంది. ఈ వీడియో సాంగ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ కనిపించబోతున్నది. వీరిద్దరి రొమాంటిక్ పోస్టర్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. సాహిబా హిందీ వీడియో సాంగ్‌ను ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ ఆలపించడంతో మ్యూజిక్ అందిస్తోంది.
ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తోన్నాడు. ఆదిత్య శర్మ, ప్రియా సారియా ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. త్వరలోనే సాహిబా సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సాహిబా మ్యూజిక్ వీడియో సాంగ్ సంబంధించి విజయ్ దేవరకొండ, రాధికా మధన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగు సినిమాలు…
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. విజయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
దిల్‌రాజు నిర్మాణంలో…
గౌతమ్ తిన్ననూరి మూవీ తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో విజయ్ సినిమాలు చేయాల్సివుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే వచ్చాయి. దిల్‌రాజు నిర్మిస్తోన్న మూవీకి రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తోన్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీరియాడికల్ యాక్షన్ మూవీ…
మైత్రీ మూవీ మేకర్స్‌తో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో టాక్సీవాలా మూవీ వచ్చింది. అలాగే పెళ్లిచూపులతో తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కలయికలో కొత్త మూవీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.