OTT: 30 ఏళ్లుగా పట్టి పీడించే శాపం.. ఓటీటీలో సరికొత్త డిటెక్టివ్ థ్రిల్లర్.. తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024


Vikatakavi OTT Release: నితిన్ నటించిన చల్ మోహన రంగా మూవీ హీరోయిన్ మేఘా ఆకాష్, మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు.

మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్

ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన వికటకవి వెబ్ సిరీస్‌ను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించారు. అయితే, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తొ రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఇటీవల వికటకవి టీజర్‌ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్లతో వికటకవి టీజర్ ఆకట్టుకుంది.

30 ఏళ్లుగా శాపం

వికటకవి టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అమ‌రిగిరిలోని దేవ‌త‌ల గ‌ట్టుకి వెళ్ల‌టానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతుంటారు. దాన్ని అమ్మోరు దేవ‌త శ‌పించిన గ్రామ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తుంటారు. అయితే ఆ గ్రామానికి చెందిన ప్రొఫెస‌ర్ మాత్రం హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌ని చేస్తుంటాడు.

ఛేదించలేని సమస్య

అమ‌ర‌గిరిలో ఎవ‌రూ ఛేదించ‌లేని స‌మ‌స్య ఉంద‌ని భావించి, దాని ప‌రిష్కారానికి త‌న శిష్యుడైన రామ‌కృష్ణ‌ను పంపిస్తాడు. అమ‌ర‌గిరి ప్రాంతానికి వెళ్లిన రామ‌కృష్ణ ఏం చేస్తాడు..? అక్క‌డి స‌మ‌స్య‌ను ఎలా గుర్తిస్తాడు..? ఎలా ప‌రిష్క‌రిస్తాడు..? అనే అంశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది.

అనుబంధం ఏంటీ

రామ‌కృష్ణ‌కు ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమ‌రిగిరి ప్రాంతంతో రామ‌కృష్ణ‌కు ఉన్న అనుబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించిన వికటకవి సిరీస్‌కు షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ వర్క్ చేశారు.

వికటకవి ఓటీటీ

ఇదిలా ఉంటే, వికటకవి వెబ్ సిరీస్‌ జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జీ5 ప్లాట్‌ఫామ్‌లో నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో వికటకవి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత వచ్చే సీన్స్‌తో ఎంతో గ్రిప్పింగ్‌గా ఉన్న వికటకవి టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

ఎలాంటి ఎత్తుగడలు

కాగా, వికటకవి టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో న‌రేష్ అగ‌స్త్య మాట్లాడుతూ.. “వికటకవిలో డిటెక్టివ్ రామ‌కృష్ణ పాత్ర‌లో న‌టించ‌టం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. నాకు చాలెంజింగ్‌గా అనిపించ‌టంతో పాటు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. రామ‌కృష్ణ అనే యంగ్ డిటెక్టివ్ ఓ నిజాన్ని క‌నిపెట్టటానికి తెలివిగా ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తాడు.. ఎలా విజ‌యాన్ని సాధిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు” అని తెలిపాడు.

తన సమస్యను కూడా

“రామకృష్ణ పాత్ర‌లో చాలా డెప్త్ ఉంటుంది. ఇందులో రామ‌కృష్ణ ఊరిలోని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌ట‌మే కాదు.. త‌న స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించుకుంటాడు. త‌ప్ప‌కుండా నా పాత్ర అంద‌రినీ మెప్పిస్తుంది. మేం క్రియేట్ చేసిన మిస్ట‌రీ ప్ర‌పంచం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది” అని హీరో నరేష్ అగస్త్య చెప్పుకొచ్చాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024