PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ – తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

దేశంలోని పవిత్ర ఆలయాలు ఉన్న కేధారినాథ్, పూరి, రామేశ్వరం, ఇతర పుణ్యక్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయమంటారా..? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలా చూస్తే… నాలుగు పవిత్ర ఆలయాలు ఉన్న మహారాష్ట్రాను నాలుగు రాష్ట్రాలుగా చేయాల్సి వస్తుందని అభిప్రాయపడింది. హిందువులు పవిత్ర పుణ్య క్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతం, టీటీడీకి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే ఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా కేఏ పాల్ స్వయంగా తన పిటిషన్ పై వాదనలు వినిపించారు. 746 మంది కాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతి సిటీని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయలేమన్నారు. ఇది ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని 14, 21, 25, 26 ఆర్టికల్స్ ను ఎత్తిచూపారు.

క్రైస్తవులు, ముస్లింలు తమ మత స్థలాలపై (చర్చిలు, మసీదులపై) స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నారని చెప్పారు. అదే హక్కు హిందువులకు నిరాకరించబడుతుందని కోర్టుకు నివేదించారు. ఇది చట్టం ముందు సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఆలయాలను రాజకీయంగా వాడుతున్నారని కోర్టుకు తెలిపారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంపై అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పలు ఆదేశాలు చేసిప్పటికీ… ఎలాంటి పురోగతి లేదని కోర్టుకు తెలిపారు. త్వరితగతిన విచారణ, జవాబుదారీతనం, సత్వర న్యాయం జరిగేలా కమిటీకి టైం బాండ్ తో కూడిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

తిరుపతికి నిత్యం వచ్చే లక్షలాది మంది భక్తుల సమస్యల పరిష్కారానికి, విచారణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మత వర్గాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయ అవకతవకలు, జోక్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం… తాము నేరుగా ప్రత్యేక స్టేట్ ఏర్పాటు చేయమని కేంద్రాన్ని ఆదేశించలేమన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై పార్లమెంట్‌లో సవరణలు జరుగుతాయని చెప్పారు.

ఈ వాదనలు వింటుంటూ… భవిష్యత్ లో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు, గురుద్వారాలు, ఇతర మందిరాలను కేంద్ర పాలిత ప్రాంతాలు చేయమంటారు? అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై ద‌ర్యాప్తున‌కు సిట్ ఏర్పాటు చేస్తూ ఎటువంటి కాల‌ప‌రిమితిని నిర్ణ‌యించ‌కుండా నెల రోజుల క్రిత‌మే ఆమోదించింద‌ని పాల్ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. విచార‌ణ కూడా ప్రారంభం కానందున‌… కోర్టు క‌నీసం 90 రోజులు, లేదా 9 నెల‌ల కాల ప‌రిమితిని నిర్ణ‌యించాల‌ని కోరారు. అందుకు ధ‌ర్మాస‌నం స్పందించ‌కుండా కేసును ముగించింది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప్ర‌సాదంగా అందించే ల‌డ్డూల తయారీకి క‌ల్తీ నెయ్యిని వినియోగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు అక్టోబ‌ర్ 4న సుప్రీం కోర్టు స్వతంత్ర ప్ర‌త్యేక ద‌ర్యాప్తు (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ వివాదం నెల‌కొన్న‌ప్పుడు కేఏ పాల్ ఈ కేసును సుప్రీం కోర్టులో దాఖ‌లు చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TtdDevotionalDevotional NewsTirumala
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024