TGSRTC : ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే జాగ్రత్త

Best Web Hosting Provider In India 2024

ప్రయాణాల సందర్భంగా ప్రయాణికులు తమ వస్తువులను బస్సులోనే మర్చిపోతుంటారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తారు. నిజాయితీగా వస్తువులను ఉన్నతాధికారులకు, పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తారు. కానీ.. ఓ డ్రైవర్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి ఆధారాలతో సహా బుక్కయ్యాడు.

ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వరంగల్ నుంచి నిజామాబాద్‌‌కు వెళ్తుంది. తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను ఆ మహిళ డ్రైవర్ సీటు వెనకాలే భద్రంగా పెట్టింది. ఆ బ్యాగ్‌లో బంగారం ఉందని గుర్తించిన డ్రైవర్.. దానిపై కన్నేశాడు. బంగారు ఆభరణాలను డ్రైవర్ సైలెంట్‌గా నొక్కేశాడు. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో రికార్ట్ చేశారు.

ఆ వీడియోను సదరు మహిళకు చూపించాడు. దీంతో మహిళ ఆగ్రహించి.. డ్రైవర్‌ను నిలదీసింది. మొదట కింద పడితే తీసుకున్నా అంటూ డ్రైవర్ బుకాయించాడు. ఆ తరువాత వీడియోను అతనికి చూపించగా ఖంగుతిన్నాడు. తానే తీశానని తప్పును ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాడు బుద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

10 శాతం డిస్కౌంట్..

హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ వినియోగదారులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్ పాస్‌తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణించవచ్చని.. వాటి టికెట్‌లో 10 శాతం రాయితీని ఇస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మెట్రో ఎక్స్ ప్రెస్ తోపాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్‌లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామని.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Whats_app_banner

టాపిక్

TsrtcWarangalNizamabadCrime TelanganaTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024