China accident: చైనాలో స్పోర్ట్స్ సెంటర్ లోకి దూసుకెళ్లిన కారు; 35 మంది మృతి; ఇది ప్రమాదమా?.. దాడా?

Best Web Hosting Provider In India 2024


China: దక్షిణ చైనాలోని జుహై నగరంలోని ఓ స్పోర్ట్స్ సెంటర్ లో వ్యాయామం చేస్తున్న వారిపైకి కారు దూసుకువెళ్లింది. 62 ఏళ్ల ఆ కారు డ్రైవర్ కారుపై అదుపు కోల్పోవడంతో, అది వేగంగా వెళ్లి, స్పోర్ట్స్ సెంటర్ లో వ్యాయామం చేస్తున్నవారిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, మరో 43 మంది గాయపడ్డారు. అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ప్లాన్ ప్రకారం చేసిన దాడినా? అన్న విషయం తెలియలేదు.

పీఎల్ఏ ఎయిర్ షో ముందు రోజు

చైనా (china) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జుహై ఎయిర్ షో కు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం, డ్రైవర్ పేరును ఫ్యాన్ గా గుర్తించారు. జుహైలోని షాంగ్ చోంగ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ క్లినిక్ సిబ్బంది మాట్లాడుతూ, కొంతమంది క్షతగాత్రులు చికిత్స అనంతరం వెళ్లిపోయారని చెప్పారు. సోషల్ మీడియా (social media) లో చక్కర్లు కొడుతున్న వీడియోలో అగ్నిమాపక సిబ్బంది ఒక వ్యక్తికి సీపీఆర్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

న్యూస్ బ్లాగర్ లీ యింగ్ కంటెంట్

వాటిని న్యూస్ బ్లాగర్ లీ యింగ్ పంచుకున్నారు. అతను X లో టీచర్ లీగా ఫేమస్. అతని ఎక్స్ ఖాతా రోజువారీ వార్తలను పోస్ట్ చేస్తుంది. ఈ వీడియోల్లో స్పోర్ట్స్ సెంటర్ లోని రన్నింగ్ ట్రాక్ పై డజన్ల కొద్దీ ప్రజలు పడి ఉన్నారు. ఒకదానిలో, ఒక స్త్రీ “నా కాలు విరిగిపోయింది” అని చెప్పింది. స్పోర్ట్స్ సెంటర్ కోసం చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘వీబో’ లో సెర్చ్ చేయగా కొన్ని పోస్టులు మాత్రమే వచ్చాయి. ఫొటోలు, వివరాలు లేకుండా ఏదో జరిగిందనే విషయాన్ని కొందరు మాత్రమే ప్రస్తావించారు. ఈ ఘటనపై సోమవారం రాత్రి నుంచి చైనా మీడియా ప్రచురించిన కథనాలను తొలగించినట్లు ఏపీ తెలిపింది.

జియాంగ్ హౌ స్పోర్ట్స్ సెంటర్ మూసివేత

జియాంగ్జౌలోని స్పోర్ట్స్ సెంటర్ కు క్రమం తప్పకుండా వందలాది మంది వెళ్తుంటారు. అక్కడ వారు ట్రాక్ పై పరిగెత్తవచ్చు. సాకర్ ఆడవచ్చు. ఇతర వ్యాయామాలు, డాన్స్ లు చేయవచ్చు. ఈ ప్రమాదం తరువాత ఆ స్పోర్ట్స్ సెంటర్ ను మూసేశారు. గతంలో చైనాలో స్కూల్ పిల్లల వంటి అమాయకులను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు జరిగాయి. అక్టోబర్ లో బీజింగ్ లోని ఓ పాఠశాలలో చిన్నారులపై కత్తితో దాడి చేసిన 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురికి గాయాలయ్యాయి. సెప్టెంబర్ లో షాంఘై సూపర్ మార్కెట్ లో జరిగిన కత్తి దాడిలో ముగ్గురు మరణించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link