Aparna :హైదరాబాద్ లో అపర్ణా కన్ స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్టు, 123 ఎకరాల్లో రూ.2851 కోట్ల పెట్టుబడితో డెక్కన్ టౌన్

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్… ఇవాళ నగరంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడితో 123 ఎకరాల విస్తీర్ణంలో టౌన్‌షిప్ ప్రాజెక్ట్ – అపర్ణా డెక్కన్ టౌన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ టౌన్‌షిప్ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్‌లో ఓ ప్రతిష్టాత్మకమైన ముందడుగు అని అపర్ణా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అపర్ణ డెక్కన్ టౌన్ మొదటి దశను రూ. 2,851 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటన తెలిపింది.

గోపన్‌పల్లి-గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మిస్తున్న అపర్ణ డెక్కన్ టౌన్ ప్రాజెక్ట్‌లో ఎత్తైన అపార్ట్‌మెంట్లు, 99 ఇండిపెండెంట్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ బంగ్లాలు ఉంటాయి.

అపర్ణా డెక్కన్ టౌన్ లో అపర్ణా సన్‌స్టోన్ మొదటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్…ఇందులో తొమ్మిది G+44 టవర్‌లు ఉంటాయి. 1,478 నుంచి 2,237 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 BHK నివాసాలను అందిస్తుంది. అపర్ణా డెక్కన్ టౌన్ , అపర్ణా సన్‌స్టోన్‌ల ప్రారంభం అల్ట్రా-లగ్జరీ విభాగంలో ఓ మైలురాయి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు. అపర్ణా డెక్కన్ టౌన్ ద్వారా హైదరాబాద్ వాసులకు విలాసవంతమైన నివాస స్థలాలను అందిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పట్టణ జీవన డిమాండ్లకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుందని అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రెడ్డి తెలిపారు.

అపర్ణా కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో 82 ప్రాజెక్టులను కలిగి ఉందని ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. రూ.3500 కోట్ల విలువైన అపర్ణా కంపెనీ 71 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, 11 వ్యాపార, వాణిజ్య ప్రాపర్టీలు కలిగి ఉందన్నారు.

“ఈ ప్రాజెక్టులు… అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్ లేఅవుట్‌లు, వాణిజ్య, రిటైల్ ప్రాజెక్టుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీలను కలిగి ఉంటాయి. ఇవి 40 మిలియన్ చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా, అదనంగా 45 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి” అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో తన రియల్ ఎస్టేట్‌ ప్రాజెక్టులను నిర్మించాలని కంపెనీ యోచిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రెడ్డి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Real EstateHyderabadTelangana NewsTrending TelanganaTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024