Best Web Hosting Provider In India 2024
ఒడిశాలోని కటక్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రైవేట్ వీడియోని చూపించి ఓ యువతిని, ఆమె బాయ్‌ఫ్రెండ్ బెదిరించాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఓ మైనర్ సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో ఐదుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు కటక్‌లోని బాదంబాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి బాయ్‌ఫ్రెండ్.. వారి ప్రైవేట్ వీడియోను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేశాడు!
దసరా పండుగ సందర్భంగా కటక్‌లోని ఓ కేఫ్‌కు వెళ్లిన సమయంలో తాము సన్నిహితంగా ఉన్న క్షణాలను అతను వీడియో తీశాడని బాధితురాలు పేర్కొంది. ఇందుకు కేఫ్ యజమాని సహకరించాడని పేర్కొంది. అనంతరం ఆ బాయ్‌ఫ్రెండ్, అతని స్నేహితులు.. ఆ సన్నిహిత వీడియోలను చూపించి యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వివరాలను కటక్ డీసీపీ జగ్మోహన్ మీనా తెలిపారు.
మైనర్ సహా ఆరుగురి అరెస్ట్..
నవంబర్ 4న ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి ప్రియుడు, కేఫ్ యజమాని, ఓ బాలుడు, మరో ముగ్గురిని.. రెండు రోజుల్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి, బీఎన్ఎస్, ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలు, ఆమె బాయ్‌ఫ్రెండ్ ప్రైవేట్ వీడియోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్ ఫోన్ల్‌ను.. భువనేశ్వర్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పరీక్ష కోసం పంపిన పోలీసులు, వాటి నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బాధితురాలిపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని మీనా మీడియా సమావేశంలో చెప్పారు. బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్న యువతులు ఎవరైనా భయం, సంకోచం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు తాజా కేసునే ఉదాహరణంగా చూపుతున్నారు.
మరోవైపు, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ భువనేశ్వర్‌లో అన్నారు.
2036 నాటికి ఒడిశాను మహిళలకు నేర రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link