Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నుంచి ఒకేసారి 3 అప్‌డేట్స్ ఇచ్చిన రష్మిక మంధాన, ఫ్యాన్స్ ఖుష్!

Best Web Hosting Provider In India 2024

మోస్ట్‌ ఎవెయిటెడ్‌ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రూల్’ నుంచి ఒకేసారి మూడు అప్‌డేట్స్‌ను హీరోయిన రష్మిక మంధాన బుధవారం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న పుష్ప-2 సినిమా రిలీజ్ కాబోతుండగా.. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందని రష్మిక మంధాన సోషల్ మీడియా పోస్ట్‌ను బట్టి తెలుస్తోంది. 2021లో రిలీజైన ‘పుష్ప: ది రైజ్’ మూవీ ఎవరూ ఊహించని విధంగా రూ.365 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే.

నేషనల్ క్రష్ క్రేజ్

పుష్ప-1లో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక మంధాన తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమా కూడా పాన్ ఇండియా లెవల్‌లో సూపర్ హిట్‌గా నిలవడంతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా రష్మిక మంధాన మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

పుష్ప సీక్వెల్ పుష్ప-2లోనూ శ్రీవల్లిగా రష్మిక కొనసాగుతోంది. ఇప్పటికే మూవీ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయ్యిందని వెల్లడించిన రష్మిక మంధాన.. సెకాండాఫ్‌కి ప్రస్తుతం డబ్బింగ్ చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసింది. మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని.. రిలీజ్ వరకూ ఆగలేకపోతున్నట్లు రాసుకొచ్చింది.

షూటింగ్ కంప్లీట్.. ఒక పాట పెండింగ్

పుష్ప-2 షూటింగ్ మొత్తం ఇప్పటికే దాదాపు పూర్తయిపోయిందని.. ఈ విషయం తనకి బాధ కలిగిస్తోందని కూడా రష్మిక మంధాన రాసుకొచ్చింది. గత వారం పుష్ప-2లో శ్రీలీల చేస్తున్న ఐటెం సాంగ్‌ను షూట్ చేయగా.. ఇక అల్లు అర్జున్, రష్మిక సాంగ్ ఒకటి మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్ప-2 సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించగా.. అల్లు అర్జున్, రష్మిక మంధానతో పాటు ఫహద్‌ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు నటించారు.

ప్రీరిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు

పుష్ప: ది రూల్ ప్రీ- రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ.1000 కోట్ల‌ు దాటిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో పావు వంతు ఓటీటీ రైట్స్‌కే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా నిడివి కూడా 3 గంటలు దాటిపోయినట్లు ఓ వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రన్‌ టైమ్‌లోనూ పుష్ప-2 సరికొత్త రికార్డ్ నెలకొల్పడం ఖాయం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024