RRR Nomination: డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష‌్ణంరాజు నామినేషన్, నేడు ఏకగ్రీవం కానున్న ఎన్నిక…

Best Web Hosting Provider In India 2024

RRR Nomination: ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కు ఆయన తరపున నామినేషన్ పత్రాలను అందజేశారు.

శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లను దాఖలు చేశారు. టి.డి.పి. తరపున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, జనసేన తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరియు బి.జె.పి. తరపున పెన్మత్స విష్ణుకుమార్ రాజు వేరు వేరుగా సంతకాలు పెట్టి ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవికి బుధవారం ఉదయం జారీచేసిన నోటిఫికేషన్ లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల్లోపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే నిబంధల మేరకు సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాయంత్రం 5.00 గంటల కల్లా నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియడంతో, మరెవ్వరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయక పోవడంతో రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి కనుమూరు రఘురామ కృష్ణంరాజును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెంన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్రా అద్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Whats_app_banner

టాపిక్

Ap AssemblyTdpJanasenaBjpAp BjpAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024