Karthika deepam november 14th episode: పారిజాతానికి సుమిత్ర స్ట్రాంగ్ వార్నింగ్- జ్యోత్స్న మెడలో తాళికట్టమన్న దీప

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today november 14th episode: తాను అడిగినట్టుగా మాట ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అనసూయ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నీ వల్ల ఎవరికో అన్యాయం జరిగిపోయిందని గింజుకుంటుంది చాలు. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు. కార్తీక్ బాబుకు భార్యగా ఉంటావా నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటావా అని అనసూయ అడుగుతుంది.

ఇంటి సంతోషం నీ చేతుల్లోనే

నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడతావ్ ఏంటని దీప అంటే అర్థం చేసుకుంది కాబట్టే మాట అడిగిందని కాంచన అంటుంది. నీ మెడలో మూడు ముళ్ళు వేసింది శౌర్య కోసమే కాదు నీ కోసం కూడా. అన్ని తెలిసే వాడు నీకు తాళి కట్టి వాడి జీవితాన్ని నీకు ఇచ్చాడు.

నాకు కావాల్సింది వాడి సంతోషం. నేను నిన్ను కోడలిగా అనుకున్నాను కానీ నువ్వు నన్ను అత్తగారిగా నా కొడుకుని భర్తగా చూడటం లేదు. బయట వాళ్ళు వంద అనుకుంటారు. ఈ ఇంటి సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నీ భర్త నమ్మకాన్ని, మా ఆశల్ని నువ్వే నిలబెట్టాలని కాంచన కూడా చెప్తుంది.

దూరంగా వెళ్లిపోదాం

నాకు మాట ఇవ్వకపోయిన పరవాలేదు నీ మనసు మార్చుకుంటే చాలని అనసూయ అంటుంది. తాతయ్య మన ఇంటికి ఎందుకు రావడం లేదని శౌర్య కార్తీక్ ని అడుగుతుంది. చిన్న నానమ్మకు సాయంగా వెళ్లాడని చెప్తాడు. జ్యో అమ్మని, నిన్ను ఎందుకు తిడుతుంది.

మనం సంతోషంగా ఉండటం వాళ్ళకు ఇష్టం లేదా? మనం ఏం చేసినా ఇలాగే కోప్పడతారా? అని మళ్ళీ అడుగుతుంది. మనం దూరంగా అన్నా వెళ్లిపోదాం అలా వెళ్తే వాళ్ళు రారు కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మానాన్న ఎలా ఉంటారో మీరు అలా ఉంటే చూడాలని ఉందని అంటుంది.

దీప పోయేలా చెయ్యి

జ్యోత్స్నతో ఒకసారి మాట్లాడాలని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న జరిగిన దాని గురించి పారిజాతంతో మాట్లాడుతుంటే సుమిత్ర వస్తుంది. కార్తీక్ ని అడగడం తప్ప నీ సంతోషం కోసం కుటుంబం ఏమైనా చేస్తుందని సుమిత్ర చెప్తుంది. అయితే దీప బావ జీవితంలో నుంచి పోయేలా చేయమని అడుగుతుంది.

దీప ఇప్పుడు కార్తీక్ భార్య అంటుంది. నేను దీపను బావ జీవితంలో ఉండనివ్వనని జ్యోత్స్న చెప్తుంది. దీప మాత్రమే కాదు నువ్వు బాధపడినా నేను చూడలేను. ఎందుకంటే దీప నిన్ను కొడితే నేను చూడలేను. తను నీ చెంప మీద కొడితే అది నా గుండెల మీద తగులుతుందని బాధగా అంటుంది.

నిజం తెలిసి షాకైన దశరథ

దీప నన్ను కొట్టిన విషయం నీకు ఎలా తెలుసు నువ్వు రిసెప్షన్ కు వచ్చావా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును వచ్చానని సుమిత్ర చెప్పడం దశరథ విని షాక్ అవుతాడు. కూతురికి అన్యాయం చేసిన మనిషిని అసహ్యించుకోకుండా దీపను దీవించడానికి వెళ్ళావా?

ఎందుకు ఇంత పక్షపాతం. అంతగా కావాలంటే దీపను దత్తత తీసుకుని తల్లి అవమని అనేసరికి సుమిత్ర కోపంగా చెయ్యి ఎత్తుతుంది. తన కోసం ఏదో ఒకటి చేయమని జ్యోత్స్న కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. నా కూతురి జీవితాన్ని నాశనం చేసే వరకు మీరు వదిలిపెట్టరని అర్థం అయ్యింది.

పారిజాతానికి వార్నింగ్

నా కూతురికి మీరు దూరంగా ఉండమని సుమిత్ర పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది. రిసెప్షన్ కు వెళ్ళకుండా ఉండాల్సిందని దశరథ బాధగా సుమిత్రను అంటాడు. ఇదే ఆఖరిసారి మరోసారి నాకు ఇలాంటివి చెప్పకుండా చేయొద్దని చెప్తాడు. వాడు నా చేతుల్లో పెరిగిన నా మేనల్లుడు, అదేమో నా ప్రాణాలు కాపాడింది.

వాళ్ళ మీద కోపం ఉన్నా ప్రేమ కూడా ఉంది. అందుకే దూరం నుంచి అయిన చూసి వద్దామని వెళ్లానని బాధపడుతుంది. కార్తీక్ తన బాధను దీపతో పంచుకుంటాడు. మన పెళ్లి గురించి పది మందికి తెలిసింది. నన్ను ఏమైనా అంటే నువ్వు ఊరుకోవని జ్యోత్స్నకు, పారుకు తెలిసింది.

మీరు నా భర్త

ఒక మనిషి నా సొంతమని ఇంతకంటే గొప్పగా ఎలా చెప్తావని అంటాడు. సమస్యలతో ఒంటరిగా నిలబడి పోరాడుతున్న మనిషికి అండగా నిలబడిన మనిషి దేవుడు అవుతాడు. నా మనసులో మీరు అదే స్థానంలో ఉన్నారు. నా కూతురు తండ్రి కావాలని అన్నదని మీరు నా మెడలో తాళి కట్టారు.

ఎవరు అవునన్నా కాదన్నా నేను మీ భార్యను, మీరు నా భర్త. కానీ నా మనసు ఈ విషయం ఒప్పుకోవడం లేదు. తప్పు చేసిన మనిషిలా నా మనసు నన్ను నిలదీస్తుంది. నా సంతోషం కోసం సుమిత్రమ్మ కూతురిని బాధపెట్టలేను కదా అంటుంది. నువ్వు ఈ ఆలోచనలో నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలని అడుగుతాడు.

జ్యోత్స్న మెడలో తాళి కట్టండి

నా మెడలో ఉన్న తాళి విప్పి జ్యోత్స్న మెడలో కట్టండి అని అంటుంది. నీ భర్తను మా అత్తకు త్యాగం చేస్తున్నావా అంటాడు. జ్యోత్స్నకు మీరంటే ప్రాణం మీకోసమే బతుకుతుంది. ఇలా జీవితాంతం వెంటపడి వేధిస్తూనే ఉంటుంది. జ్యోత్స్నను నేను మరదలిగానే చూశాను తప్ప పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు.

అమ్మ కోసం సరే అన్నాను. నాన్న తప్పు చేశాడని వాళ్ళు అమ్మని వద్దని పెళ్లి జరగదని అంటే నేనేమీ బాధపడలేదు. అమ్మ పుట్టింటికి దూరమయ్యిందని బాధపడ్డాను. మా అమ్మ నేను అందరం సంతోషంగా ఉన్నాము. ఒక్క నువ్వు తప్ప. అన్ని మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండవచ్చు కదాని అడుగుతాడు.

నాకు ఉండాలనే ఉంది

తాను అలా ఉండలేనని అంటుంది. దీప గదిలో నుంచి వెళ్లిపోతుంటే ఇలా వెళ్ళిపోవడం తనకు నచ్చలేదని చెప్తాడు. దీంతో దీప చాప తెచ్చుకుని అక్కడే పడుకుంటుంది. నీ బాధను త్వరలోనే పోగొడతాను అంటాడు.

మీరంతా కోరుకునే విధంగా ఉండాలని నాకు ఉంది కానీ అన్నం పెట్టిన మనిషిని మోసం చేశాననే భారంతో నేను బతకలేనని అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకయదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024