Best Web Hosting Provider In India 2024
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత… పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం జాబితాను ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి జాబితాను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
గతేడాది జులైలో గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావటంతో గ్రూప్4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది .
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించిన తర్వాత…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. తుది ఎంపిక కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. వెరిఫికేషన్ తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ దశలవారీగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో తాజాగా గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే గ్రూప్ 4 అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
టాపిక్