Best Web Hosting Provider In India 2024
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో తీసుకుంటున్న సంస్కరణలు, నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగారు కాబట్టే ఈ వజ్రోత్సవాలను గర్వంగా, ఆడంబరంగా నిర్వహించుకోగలుగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు.