Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో వైయస్ జగన్ సమావేశం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం
పోలవరం ఎత్తు, ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నం..
కీలక అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం
వైయస్ఆర్‌సీపీ ఎంపీల ప్రకటన
మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు
ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తాం
ప్రెస్‌మీట్‌లో వైయస్ఆర్‌సీపీ ఎంపీల స్పస్టీకరణ
తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా రాజీ పడొద్దని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం తర్వాత ఎంపీలు తనూజా రాణి, మేడా రఘునాధ రెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే..
– పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తుతాం.
– ప్రధానంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న నిర్ణయం వల్ల కలిగే నష్టాన్ని సభలో ప్రస్తావిస్తాం. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం. ప్రధానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. అలాగే ప్రాజెక్టు పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని, ఆర్ అండ్ ఆర్ నిధులు తక్షణమే విడుదల చేసి ముంపు ప్రాంత వాసులకు న్యాయం చేయాలని కోరుతాం.
– విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఢిల్లీలో ధర్నా చేపడతాం. దీనిపై మా అధ్యక్షులు వైయస్ జగన్ స్పష్టంగా సూచించారు.
– విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోము. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యేలా మా వంతుగా గట్టి ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.
– వక్ఫ్ బిల్లుకు సంబంధించి మేం చాలా పట్టుదలగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లును ఆమోదించే ప్రసక్తి లేదు. దీనిపైనా ఆందోళన చేయాలని మా అధ్యక్షుడు నిర్దేశించారు. మనది సెక్యులర్ దేశం. వక్ఫ్ బిల్లుతో దానికి అర్ధం లేకుండా చేస్తే.. ముస్లిం మైనారిటీల తరపున అవసరమైతే పార్లమెంట్‌ను స్ధంభింప చేస్తాం.
– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యా యత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు సాకుగా చూపుతూ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధిస్తున్నారు. పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.
– సోషల్ మీడియా కార్యకర్తలపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. ఒకరిద్దరిపై ఏకంగా 15 కేసులు నమోదు చేయడం, కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు నిదర్శంగా నిలుస్తోంది. ఇంత తీవ్రమైన దారుణాలు గతంలో ఎన్నడూ చూడలేదు.
– మరోవైపు టీడీపీకి చెందిన సోషల్ మీడియా పెడుతున్న దారుణమైన పోస్ట్‌లపై మా పార్టీ నాయకులు సాక్ష్యాధారాలతో సహా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎక్కడా పోలీసులు స్పందించడం లేదు. కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదు.
– ఈ విషయాలను కూడా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, చట విరుద్ధమైన అరెస్టుల వ్యవహారాన్ని జాతీయస్థాయిలో అన్ని పార్టీల దృష్టికి