‘కూటమి’ డైవర్ట్‌ పాలిటిక్స్‌

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్ జిల్లా అధ్య‌క్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి

వైయ‌స్ఆర్‌ జిల్లా:  హామీలు త‌ప్పించుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం డైవ‌ర్ట్ పాలిటిక్స్ చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ర‌వీంద్రనాథ్‌రెడ్డి విమ‌ర్శించారు. వైయ‌స్‌ జగన్, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై చంద్రబాబు సర్కార్‌ బురదచల్లడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ ఏడు నెలల కాలాన్ని గడిపేశారు. పరిపాలనలో అప్పులు తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కారు. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నెలకో అభూత కల్పనలు తీసుకొచ్చి అభాండాలు వేస్తున్నారు. తిరుమల లడ్డూ నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల వరకూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్‌ జగన్ ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అదానీ ఒప్పందాలు అంటూ కొత్త కథలు అల్లుతున్నారు.

విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వైయ‌స్‌ జగన్ కృషి చేశారు. చంద్రబాబు 13 వేల కోట్లు ఇస్తే.. జగన్ 40 వేల కోట్లు డిస్కాంలకు ఇచ్చారు. చంద్రబాబు అన్నీ తాత్కాలికమైన పనులు చేస్తే.. జగన్ దూరదృష్టితో పని చేసారు. అన్నీ అమ్మేయడమా? ప్రైవేటీకరణ చేయడమా అనే రీతిలో చంద్రబాబు పని చేస్తాడు. చెప్పింది మర్చిపోవడం తప్ప చంద్రబాబుకు ఏ విజన్ లేదు. సెకీతో ఒప్పందం చేసుకుని తక్కువకే సోలార్ పవర్ తెస్తే అదానీ పేరు చెప్తున్నారు. 2021 జనవరిలో కేంద్రం ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు రద్దు చేసింది. ఆ తర్వాత వైఎస్‌ జగన్ ప్రభుత్వం సెకీ తో ఒప్పందం చేసుకున్నారు.

చంద్రబాబు తన హయాంలో సోలార్ పవర్ 5.50 పైసలతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నాడు. వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో 2.30 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఎవరు ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేసారో ప్రజలు గమనించాలి. వాస్తవాలను దాచి ఆ పత్రికలు చంద్రబాబును మోసే పనిలో పడ్డారు. ప్రజలు చంద్రబాబు డ్రామాలు గమనిస్తూనే ఉన్నార‌ని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.

Best Web Hosting Provider In India 2024