Best Web Hosting Provider In India 2024
కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని వైఎస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చెప్పారు. ముఖ్యమంత్రి ఉన్నత లక్ష్యాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వైద్య విభాగం జోనల్ ఇన్చార్జి డాక్టర్ హరికృష్ణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం వైద్య రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.