Best Web Hosting Provider In India 2024
29 Nov 2024 5:36 PM
తాడేపల్లి: పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు – 2024ను వ్యతిరేకించినందుకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దిన్ తదితరులు కలిశారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అనేక అంశాలతో కూడిన మెమెరాండంను వైయస్ జగన్‌కు అందజేసిన మైనార్టీ నాయకులు, తప్పనిసరిగా తమ పార్టీ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చిన వైయస్ జగన్
సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీ హజ్ కమిటీ మాజీ ఛైర్మన్ గౌస్ లాజం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మునీర్ బాషా, ఇబాదుల్లా, ముషాహిద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.