విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలి

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌

విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ప్రచారం

అధికారంలోకి రాగానే పచ్చిగా మాట తప్పిన చంద్రబాబు

కూటమి ప్రభుత్వం రావడంతోనే బాదుడే బాదుడు

ఆరు నెలల్లోనే రెండుసార్లు విద్యుత్‌ ఛార్జీల మోత

ప్రజలపై మొత్తం రూ.15,486 కోట్ల ఛార్జీల భారం

ప్రజల నడ్డి విరుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనడమే కరెక్ట్‌

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపణ

విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత బాబుదే

వైఎస్‌ జగన్‌ ఒప్పందాలతో లక్ష కోట్ల సంపద సృష్టి

చంద్రబాబు పీపీఏల వల్ల రూ.87,500 కోట్లు ఆవిరి

ఇప్పటికే దారుణంగా మండుతున్న నిత్యావసరాల ధరలు

నిత్యవసరాల ధరల పెంపుతో సామాన్యుడి బతుకు భారం 

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు:  కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు గడవక ముందే రెండోసారి కరెంట్‌ వాతలు పెట్టడానికి చంద్రబాబు సిద్ధమయ్యార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఐదేళ్ల పాటు కరెంట్‌ చార్జీలు పెంచనని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు హామీని తుంగలో తొక్కారు. అధికారంలోకి రాగానే బాదుడే బాదుడు అంటూ ధ్వ‌జ‌మెత్తారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాల‌ని 
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ‌నివారం నెల్లూరులో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

– ఇప్పటికే దారుణంగా మండుతున్న నిత్యావసరాల ధరలు. పప్పు, ఉప్పు మొదలు వంటనూనె వరకు ధరలమోత. ఇంకా స్కూల్‌ ఫీజులమోత. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఛార్జీల భారం. దీంతో సామాన్యుల నడ్డి విరుగుతున్న వైనం. ఇదీ కూటమి ప్రభుత్వ పనితీరు. 
– ఇప్పటికే ఒకసారి దీపావళి సందర్భంగా రూ.6,073 కోట్ల కరెంట్‌ ఛార్జీలు వడ్డించిన చంద్రబాబు మరోసారి రూ. 9,412 కోట్ల మేర ఛార్జీల పెంపునకు సిద్ధమయ్యారు. అలా ఈ ఆరు నెలల్లోనే రూ.15,486 కోట్ల భారాన్ని విద్యుత్‌ ఛార్జీల రూపంలో మోపుతున్నారు. దీని వల్ల ఒక్కో యూనిట్‌పై రూ.2.19 ఛార్జీ పెరుగుతోంది.

బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ:
– ప్రజలను మోసం చేయాలనుకున్న ప్రతిసారీ చంద్రబాబు వైయస్సార్‌సీపీ మీద, జగన్‌గారి మీద నిందలు మోపుతున్నారు. వాటికి పచ్చ మీడియా బాకా ఊదడం అలవాటుగా మారింది. 
– నిజానికి రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో మునిగిపోవడానికి అసలు కారణం చంద్రబాబే. 2014–19 మధ్య కమీషన్ల కోసం ఆయన అవినీతికి పాల్పడుతూ చేసుకున్న ఒప్పందాలే రాష్ట్రాన్ని ముంచేశాయి. 
– ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. ఐదేళ్లు కరెంట్‌ ఛార్జీలు పెంచను, ట్రూఅప్‌ ఛార్జీలు ఎత్తేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు.. విద్యుత్‌ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలోనూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
– తన మార్కు నయవంచనతో ప్రజలకిచ్చిన హామీలకు తూట్లు పొడిచి మోసం చేయడమే కాకుండా మరింత భారం మోపుతున్నాడు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రచారం చేశాడు. వాస్తవం చూస్తుంటే బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ అని అర్థమైంది. 

చంద్రబాబు పీపీఏలతో రూ.87,500 కోట్లు ఆవిరి!:
– రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల (ఐఎస్‌టీసీ)తో కలిపి యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంది. 9వేల మెగావాట్లు, అంటే 17 వేల మిలియన్‌ యూనిట్లు. 
– అంత తక్కువ ధరకే సౌర విద్యుత్‌ అందుబాటులోకి రావడం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.4400 కోట్లు ఆదా అవుతాయి. ఆ విధంగా 25 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి.
– అదే చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య విండ్‌ పవర్‌కు  సంబంధించి 3494 మెగావాట్లకు 133 ఒప్పందాలు చేసుకోగా, గరిష్టంగా రూ.4.84కి అవగాహన కుదిరింది. 
– అలాగే సోలార్‌ పవర్‌కు సంబంధించి 2500 మెగావాట్లకు రూ.6.80 లెక్కన ఒప్పందాలు చేసుకున్నారు. చంద్రబాబు ఒప్పందాల సగటు రేటు రూ.5.10. 
– 3494 మెగావాట్ల విండ్‌ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్‌ గత ప్రభుత్వం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. 3500 మెగావాట్లు అంటే 9వేల మిలియన్‌ యూనిట్లకు రూ.2.35 చొప్పున లెక్కిస్తే, ఏటా రూ.2వేల కోట్లు. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్‌ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.
– ఇక సోలార్‌ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లకు చేసుకున్న ఒప్పందం యావరేజ్‌ ప్రైజ్‌ రూ.5.90. అదే గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే బాబు హయాంలో కన్నా రూ.3.41 తక్కువ. 2400 మెగావాట్లు అంటే 4200 మిలియన్‌ యూనిట్లు. ఆ లెక్కన ఏటా రూ.1500 కోట్ల భారం. 25 ఏళ్లకు రూ.37,500 కోట్లు. 
– అంటే గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంటే, చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో ఏకంగా రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. 

రాష్ట్రంలో గాడి తప్పిన పాలన:
– గత ప్రభుత్వం హయాంతో పోలిస్తే.. ఇప్పుడు పప్పు, ఉప్పు మొదలు వంట నూనెల వరకు నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. స్కూల్‌ ఫీజులు పెరిగాయి. మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. పేరుకే ఉచిత ఇసుక.. గతంలో కంటే ఎక్కువ ధర. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. ఏది చూసినా బాదుడే బాదుడు.
– కూటమి నాయకులు సిండికేట్‌గా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రజల్ని దోచుకు తింటున్నారు. సంపద సృష్టిస్తానని ఊదరగొట్టి సంపద మొత్తాన్ని ఆవిరి చేస్తున్నారు. తమ కోసమే సంపద సృష్టించుకుంటున్నారు. 
– గాడి తప్పిన పాలనతో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి విద్యుత్‌ ఛార్జీల మోత ఏ మాత్రం సరికాదు. కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Best Web Hosting Provider In India 2024