స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలి

Best Web Hosting Provider In India 2024

 కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల విన‌తి

న్యూఢిల్లీ:  స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు . సోమ‌వారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంట్‌ సభ్యులు కలిశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి అయోధ్య రెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
 
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది, తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు.

విశాఖ ఉక్కు టర్న్‌ అరౌండ్‌ సాధించడానికి అవసరమైన చేయూత కేంద్రం అందించాలని వినతిపత్రంలో కోరిన ఎంపీలు, మరో రెండేళ్ళపాటు కేంద్రం నుంచి చేయూత అందితే ఆర్ధిక పరిస్ధితి మెరుగువుతుందన్న ఎంపీలు

ఇన్‌పుట్‌  ఖర్చులను తగ్గించడానికి  వీలుగా ఆర్‌ఐఎన్‌ల్ కు క్యాప్టివ్‌ మైన్‌లను కేటాయించడం ద్వారా వ్యయప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడుతుందని, కేంద్ర సహకారం అందిస్తే ప్లాంట్‌ మళ్ళీ లాభదాయకమైన వెంచర్‌గా మారుతుందని కేంద్ర మంత్రికి తెలిపిన ఎంపీలు

ఆర్ధిక పునర్నిర్మాణానికి కేంద్రం సాయపడాలని విజ్ఞప్తి, తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల బృందం, వచ్చే కేబినెట్ లో ఈ ప్రతిపాదనలు పెడతానని హామీ ఇచ్చారన్న ఎంపీలు.

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక. 20వేల మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. అప్పులను వాటాలుగా బదిలీ చేయాల‌ని ఎక్స్‌లో విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్‌ చేశారు. 

Best Web Hosting Provider In India 2024