పవన్ కళ్యాణ్ మొదట‌ అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకే

Best Web Hosting Provider In India 2024

విశాఖ‌: పవన్ కళ్యాణ్ మొదట‌ అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకేనని.. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకుని మోసం చేశారని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విధానం అంటూ లేని పార్టీ జనసేన అంటూ మంత్రి విమర్శించారు. వారాహి యాత్ర ఎందు కోసమో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . పవన్‌కు పది ప్రశ్నల పేరుతో మంత్రి అమర్‌నాథ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *