Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలు అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ.. ఒక గిరిజన ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎం చేసిన ఘనత వైయస్ జగన్‌దని గుర్తుచేశారు. గిరిజనులకు ఏం కావాలో తెలుసుకొని మరీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని వివరించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 18 సెల్ టవర్లతో అన్ని గ్రామాలకు కమ్యూనికేషన్ వచ్చిందన్నారు.