ఆరోగ్య‌శ్రీ ఆస్ప‌త్రుల‌న్నీ క్యాన్స‌ర్ గ్రిడ్‌తో అనుసంధానం

Best Web Hosting Provider In India 2024

మంగ‌ళ‌గిరి: ఆరోగ్యశ్రీ క్యాన్సర్‌ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడద‌ల ర‌జిని ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో పాలియేటివ్‌ కేర్‌ కోసం 5 శాతం పడకలను కచ్చితంగా కేటాయించాలని ఆదేశించారు. ఐబ్రిస్ట్‌ స్క్రీనింగ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగ‌ళ‌గిరిలో ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ ప్రధాన కార్యాల‌యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి విడ‌ద‌ల ర‌జిని స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *