ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.10-7-2022(ఆదివారం) ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
రాబోయే 2024 ఎన్నికల్లో ఏం జరుగబోతుందో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి ప్లీనరీ తో చూపించారు : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
175 స్థానాలకు 175 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుంది ..
తెలుగుదేశం పార్టీ కి -దత్తపుత్రుడి కి దుష్టచతుష్టయానికి చివరకు మిగిలేది “సున్నా” నే ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీకి తరలివచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు కు గుండెలు పగిలిపోయాయి ..
రైతు లే లేకుండా పరిటాల లో తెలుగుదేశం పార్టీ రైతు పోరు నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది ..
వ్యవసాయం దండగ అని – వరి ,సుబాబులు సోమరిపోతు పంట లని వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ నేతలే రైతు పోరు అని కార్యక్రమం నిర్వహిస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు ..
వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం చేయాలో అర్థం కాక రైతు పోరు సభలో వైయస్ జగన్ పై ఏడుపులు , పెడబొబ్బల హోరు వినిపించారు ..
వ్యవసాయం -రైతు అనే పదాలకు వన్నే తెచ్చేలా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
చంద్రబాబు రైతులకు మేలు చేశాడో – వైయస్ జగన్ రైతులకు మేలు చేశాడో నిజమైన రైతులందరికీ తెలుసు ..
గత ప్రభుత్వంలో సుబాబుల రైతులకు బకాయిలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఏడిపిస్తుంటే , నందిగామలో అప్పటి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సుబాబుల రైతుల బకాయిల కోసం పాదయాత్ర నిర్వహిస్తే , ఐదేళ్ళు మంత్రిగా అధికారం లో ఉన్న దేవినేని ఉమా రూ.2 కోట్లు మాత్రమే బకాయిలు విడుదల చేయిస్తే ,అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.11 కోట్లు పూర్తి బకాయిలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది – ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిది ..
తెలుగుదేశం పార్టీని – చంద్రబాబు ని రైతులు, ప్రజలు ఎప్పటికీ నమ్మరు , ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం అనేది కలలో కూడా జరగని పని ..
రైతుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నాయి , రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి ఏడాది రూ.13,500/- ఆర్థిక చేయూత అందజేయడమే కాకుండా ,రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఆయా గ్రామాల్లోనే రైతులకు అవసరమైన విత్తనాలు – ఎరువులు- వ్యవసాయ పరికరాలు ప్రభుత్వమే అందజేస్తూ, వారికి అవసరమైన పూర్తి వ్యవసాయ సమాచారాన్ని అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ దే అని తెలిపారు ..
అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో 65 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన జరగగా ఇప్పటికే దాదాపు 16 భవనాలు పూర్తయి రైతులకు సేవలందిస్తున్నాయి , నందిగామ నియోజకవర్గంలో క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.81 కోట్లు అందించడం ,నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆర్.బి.కే హబ్ ఏర్పాటు చేయడంతో పాటు అగ్రిటెస్ట్ ల్యాబ్ నిర్మాణం , నందిగామ లోనే మొట్టమొదటిసారిగా పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం ,పత్తి రైతులకు లబ్ధి చేకూరేలా జిల్లాలోనే మొదటగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ,ప్రతి గ్రామంలో రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ మద్దతు ధర అందించడం ఇది వరకు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు -? ..
దానితోపాటు వైయస్సార్ జలకళ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు వేయడంలో జిల్లాలోని నందిగామ అగ్రస్థానంలో నిలవడం , ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు నష్టపోతే ఆ ఏడాదే వెంటనే నష్ట పరిహారం అందించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని , పొరపాటున రైతు చనిపోతే- ఆత్మహత్య చేసుకున్న రూ.7 లక్షలు ఆ కుటుంబానికి వెంటనే అందించే ప్రభుత్వం ఇది వరకు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు -? ..
రైతులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని .. చంద్రబాబు అంటేనే రైతులు అసహ్యించుకుంటారని , ఆ స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు రైతు పోరు పేరుతో రైతులకు మేలు చేస్తున్న వైఎస్ జగన్ విమర్శించడం ఆకాశం పై ఉమ్మినట్లు ఉంటుందని , ఆకాశం పై ఉమ్మితే అది మీ మొహం మీదే పడుతుంది అని తెలిపారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ,రైతుల ఆశీస్సులు ఉన్నాయి , రాబోయే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు ..
అదేవిధంగా జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన నందిగామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ,అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ..
నందిగామ :
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రెస్ నోట్ విడుదల చేసారు ..