




ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.19-8-2022 (శుక్రవారం) ..
యానాదుల కు పక్కా గృహాల నిర్మాణానికి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 63 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేత ..
యానాదుల సంక్షేమానికి -అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
చందర్లపాడు గ్రామం లోని జగనన్న కాలనీ లో యానాదుల ఇళ్ల నిర్మాణాలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం కింద మంజూరైన చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇల్లు లేని పేద వాళ్ళు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను ఆయా పంపిణీ చేయడంతో పాటు , సొంతగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందజేస్తూన్నారని , అంతేకాకుండా యానాదుల కు ప్రత్యేకంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ప్రత్యేకంగా అదనపు ఆర్థిక సహాయం కూడా అందజేస్తూన్నారని తెలిపారు , ఎస్సీ -ఎస్టీ -బిసి- మైనారిటీ లైన -పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు ,పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , వెలగపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..