Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: నంద్యాల జిల్లా పరిధిలో అవుకు, పాణ్యం, బేతంచెర్ల,డోన్ మండలాల్లో ఏర్పాటు చేసే సోలార్, విండ్ ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అవుకు మండలంలో జూనూతల, ఉప్పలపాడు, కొండమనాయునిపల్లి గ్రామాల్లో గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 2300 మెగా వాట్ల సోలార్ పవర్‌ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎంగ్రీన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 700 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 300 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్ మండల కేంద్రంలో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లకు బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.