Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తయని చెప్పారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.