కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు

Best Web Hosting Provider In India 2024

కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్  

అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం

మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు

2027 చివరిలో జమిలి ఎన్నికలు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
 

వైయ‌స్ఆర్ జిల్లా : కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశామ‌న్నారు. ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.  పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.  కానీ, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్‌ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన.

ఈ కార్యక్రమంలో.. ఆంజాద్‌ బాషా, కడప మేయర్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు.  ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైయ‌స్‌ జగన్ సూచించారు.

Best Web Hosting Provider In India 2024