బాబు సంప‌ద సృష్టించ‌డం లేదు..దోచుకుంటున్నారు

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని,  ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కూటమి నేతలు ఎ‍న్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్‌ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు.  ఇప్పుడు మళ్లీ స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు.

వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో  నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ నుంచి ఉద్యోగులను తొలగించారు… చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు.

వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్‌ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ నుంచి ఏకంగా 4వేల మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి కూటమి  ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

Best Web Hosting Provider In India 2024